తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలలో విశాల్(Vishal) కెరీర్ మొదట్లో ఇక్కడ మంచి విజయాలు సొంతం అవ్వడంతో తనకి ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది…మాస్ మూవీస్ తో ఆ మార్కెట్ ను చాలా వరకు కాపాడుకున్నా కూడా మధ్యలో వరుస ఫ్లాఫ్స్ తో మార్కెట్ కోల్పోయాడు… అప్పుడప్పుడు కొన్ని మంచి హిట్స్ తో జోరు చూపించిన విశాల్…
ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie Telugu Review) తో వచ్చేశాడు. మరి ఈ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే ల్యాండ్ సెటిల్మెంట్ గ్యాంగ్ హీరోయిన్ వెంట పడుతూ ఉంటారు… హీరో ఆమెని సేఫ్ చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటి…హీరో ఆమెని ఎలా సేఫ్ చేశాడు అన్నది కథ పాయింట్…
పరమ రొటీన్ కథ పాయింట్ తో వచ్చిన రత్నం మూవీ కేవలం యాక్షన్ సీన్స్ తోనే నిండిపోయి ఏమాత్రం కథ లేకుండా చిరాకు తెప్పించింది…. ప్రతీ సారి విలన్స్ హీరోయిన్ మీద అటాక్ చేయడం, హీరో వచ్చి సేఫ్ చేయడం ఇదే రిపీట్…. ఇలా కథ మొత్తం రకరకాల ఎపిసోడ్స్ తో ఫైట్ సీన్స్ తో విలన్స్ ని హీరో నరకడమే కథగా రాసుకున్నాడు డైరెక్టర్ హరి…
మాస్ మూవీస్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ సైతం ఇంక చాలు ఆపండి అనిపించే లెవల్ లో సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయి. విశాల్ తన రోల్ వరకు పర్వాలేదు అనిపించినా అసలు ఎందుకు ఈ కథని ఒప్పుకున్నాడు అనిపిస్తుంది. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ పర్వాలేదు అనిపించగా హీరో హీరోయిన్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఒకటి రెండు పాటలు పర్వాలేదు అనిపించినా బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉంటుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బోర్ కొట్టించాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింటే చాలా వీక్ గా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి….
ఎంత మాస్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న ఆడియన్స్ సైతం రత్నం మూవీని తట్టుకోవాలి అంటే చాలా ఓపిక అవసరం, అలాంటి ఓపిక ఉంటే అతి కష్టం మీద సినిమా ఎండ్ అయ్యే టైంకి యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు సినిమా. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…