Home న్యూస్ ప్రతినిధి2 1st డే కలెక్షన్స్ రిపోర్ట్….!!

ప్రతినిధి2 1st డే కలెక్షన్స్ రిపోర్ట్….!!

0

కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్(Nara Rohit) నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie 1st Day Collections) తో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు…ప్రజెంట్ ఎలక్షన్స్ ఫీవర్ మరో లెవల్ లో ఉండటంతో ఈ సినిమా ఆ అడ్వాంటేజ్ ను వాడుకుంటుంది మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా కూడా…

సినిమాకి మొదటి ఆటకే బిలో పార్ టాక్ అయితే సొంతం అయ్యింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది సినిమా….మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో 5 వేల లోపు టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా….

పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల లోపు గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని అంచనా… వరల్డ్ వైడ్ గా 45 లక్షల లోపు గ్రాస్ ను అందుకుందని అంచనా…మొత్తం మీద మొదటి రోజు షేర్ లెక్క 22 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా…

మొత్తం మీద రీసెంట్ టైంలో వచ్చిన పొలిటికల్ మూవీస్ మాదిరిగానే ప్రతినిధి2 సినిమా కూడా పెద్దగా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో విఫలం అయింది. సినిమా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ రేంజ్ 3.50 కోట్ల దాకా ఉండగా సినిమా మొదటి రోజు నిరాశ కలిగించే ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది….

మొత్తం మీద సినిమాకి ఎవరూ పెద్దగా ఎక్కువ కలెక్షన్స్ ఎక్స్ పెర్ట్ చేయలేదు కానీ ఖాళీగా ఉన్న థియేటర్స్ లో ఎంతో కొంత ఫీడింగ్ ఉంటుంది అనుకున్నా కూడా జనాలను థియేటర్స్ కి ఏ సినిమాలు కూడా పెద్దగా రప్పించ లేక పోతున్నాయి. ఇక వీకెండ్ లో ప్రతినిధి2 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here