Home న్యూస్ వీకెండ్ లో వీరవిహారం…ట్రేడ్ విస్తుపోయేలా చేసిన చిన్న సినిమా!

వీకెండ్ లో వీరవిహారం…ట్రేడ్ విస్తుపోయేలా చేసిన చిన్న సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సీజన్ ఆల్ మోస్ట్ అయిపొయింది….ఎలక్షన్స్ ఫీవర్ వలన చాలా వరకు ఇండస్ట్రీలలో అనుకున్న రేంజ్ లో సినిమాలు పడలేదు. ఇప్పుడు అన్నీ సెట్ అవుతూ ఉండటంతో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా ఒకటి సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ లో దుమ్ము లేపింది.

అసలు స్టార్ కాస్ట్ గురించి కూడా పెద్దగా తెలియాలి ముంజ్య(Munjya Movie) అనే సినిమా జస్ట్ ట్రైలర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది…దాంతో సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనగా రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా కి…

కలెక్షన్స్ వీకెండ్ లో సాలిడ్ గా వచ్చాయి…మొదటి రోజున 4.21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు దుమ్ము లేపుతూ 7.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు సండే మరింత జోరుగా హోల్డ్ ని చూపించిన ఈ సినిమా 8.43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

దాంతో సినిమా వీకెండ్ లో మొత్తం మీద ఏకంగా 20.04 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని అద్బుతమైన స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విశేషం. పెద్దగా స్టార్ కాస్ట్ ఏంటో కూడా పెద్దగా తెలియని ఈ సినిమా ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు…

అవలీల 75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్ లో సినిమా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేయలేదు…ఆ రేంజ్ లో ఈ హర్రర్ కామెడీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here