Home న్యూస్ మహారాజా రివ్యూ…విజయ్ సేతుపతి మాస్…హిట్టు మూవీ!!

మహారాజా రివ్యూ…విజయ్ సేతుపతి మాస్…హిట్టు మూవీ!!

0

విలక్షణ యాక్టింగ్ తో నటుడిగా మంచి పేరుని సొంతం చేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ అయిన(Maharaja Movie REVIEW RATING) సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక 50వ సినిమా అయినా కూడా ఎక్స్ పెరిమెంటల్ సబ్జెక్ట్ తోనే వచ్చిన విజయ్ సేతుపతి ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే ఒక యాక్సిడెంట్ లో తన భార్యని కోల్పోయిన హీరో తన కూతురే సర్వస్వం అనుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. సెలూన్ షాప్ నడుపుకునే హీరో ఒకరోజు దెబ్బలతో పోలిస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ తన ఇంట్లో దొంగలు పడ్డారని తన కూతురు ప్రాణాన్ని కాపాడిన లక్ష్మీ ని దొంగతనం చేశారని అంటాడు…కానీ ఆ లక్ష్మీ అనేది ఒక వస్తువు అని తెలుసుకున్న పోలీసులు…

హీరో కేసు తీసుకోరు…ఈ క్రమంలో మరో పక్క అనురగ్ కశ్యప్ దొంగతనాలు చేస్తాడు…తనకి హీరోకి మధ్య గొడవ ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ….కథ ఓవరాల్ గా విన్నప్పుడు రొటీన్ గానే అనిపించినా కూడా డైరెక్టర్ సినిమాను చెప్పిన తీరు చాలా బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా చాలా చోట్ల డైరెక్టర్ అంచనాలను మించి జోరు చూపించాడు….

విజయ్ సేతుపతి మరోసారి అద్బుతంగా నటించాడు…కొన్ని సీన్స్ లో జస్ట్ కళ్ళతోనే తన హావభావాలు అద్బుతంగా పలికించాడు….ఇక కొన్ని చోట్ల హీరో ఎలివేషన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో సెట్ అయ్యాయి. ఇక అనురాగ్ కశ్యప్ విలనిజం కూడా బాగా ఆకట్టుకుంది…ఇక హీరో కూతురు రోల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో చెప్పే డైలాగ్స్ చాలా బాగా మెప్పిస్తాయి…మిగిలిన యాక్టర్స్ బాగా నటించారు…

సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా మెప్పించింది. సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ టేక్ ఆఫ్ కి కొంచం టైం పట్టినా కూడా తర్వాత మాత్రం యమ జోరుగా సాగుతుంది…మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు ఈ జోరు కొనసాగగా క్లైమాక్స్ రొటీన్ గానే అనిపించింది…అయినా కూడా ఇంపాక్ట్ ఉంటుంది…

సినిమా కొంచం లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించినా కూడా ఇంపాక్ట్ ఫుల్ సీన్స్ తో నిండిపోయిన సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకెండ్ ఆఫ్ లో వచ్చే ట్విస్ట్ లు టర్న్ లు అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి… దాంతో అక్కడక్కడా కొన్ని చోట్ల డ్రాగ్ అయినా కూడా సినిమా ఎండ్ అయ్యే టైం మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి రావడం ఖాయం..

అలాగే సినిమాలో కొన్ని చోట్ల విజిల్స్ వేసే సీన్స్ కూడా బాగా మెప్పించాయి… ఓవరాల్ గా రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లో మంచి సినిమాల్లో ఒకటిగా మహారాజ మొఇఎ నిలుస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here