Home న్యూస్ కల్కి2898AD ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

కల్కి2898AD ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie REVIEW) వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారింది…

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సినిమా ఓపెన్ అవ్వడం చాలా ఆసక్తిగా ఓపెన్ అవుతుందని అంటున్నారు…. మహాభారతం టైంలో తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తున్న అశ్వద్ధామ కలియుగం ముగింపు దశలో ఒక అమ్మాయి కడుపులో దైవం ఉందని తెలిసి తనని కాపాడాలని నిర్ణయం తీసుకుంటాడు….

కానీ ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ వలన తనకి ప్రమాదం అని తెలిసిన క్రూరుడు అయిన యాస్కిన్ తనని చంపాలని చూడగా స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఆ అమ్మాయిని విలన్స్ కి అప్పగించాల్సిన అవసరం హీరోకి ఏర్పడగా తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పాలి….

10 వేల మందితో సముద్రం ఎరుపెక్కుతుంది….దేవర లేటెస్ట్ అప్ డేట్!
సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత కొంచం స్లో అయినట్లు అనిపించినా తర్వాత కథ టేక్ ఆఫ్ అయినప్పటి నుండి మాత్రం మంచి ఇంటెన్స్ సీన్స్ తో, మంచి యాక్షన్ సీన్స్ తో అబ్బురపరిచే విజువల్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచగా…

సెకెండ్ ఆఫ్ కథ కూడా అక్కడక్కడా కొంచం లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించినా కూడా తర్వాత సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తిని సినిమా ఆసాంతం కొనసాగాలే చేసి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు ట్విస్ట్ లను రివీల్ చేస్తూ ఎండింగ్ బాగా మెప్పిస్తుందని అంటున్నారు…. 

దిల్ రాజు లెక్క తప్పుతుంది…దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి!
ఓవరాల్ గా సినిమా అక్కడక్కడా కొంచం స్లో అయినట్లు లెంత్ పెరిగినట్లు అనిపించినా కూడా టికెట్ డబ్బులకు వర్త్ అనిపించేలా చాలా సీన్స్ మెప్పిస్తాయని, సినిమా అయ్యే సరికి ఆడియన్స్ మాత్రం ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి రావడం ఖాయమని అంటూ ఉన్నారు ఇప్పుడు.

ఓవరాల్ గా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత కల్కి మూవీకి ఆడియన్స్ నుండి హిట్ రేంజ్ నుండి కొన్ని చోట్ల ఆ పైన కూడా టాక్ వినిపిస్తుంది….రెగ్యులర్ షోలకి కూడా ఇదే రేంజ్ టాక్ వినిపిస్తే మట్టుకు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి ని ఆపడం ఇప్పట్లో ఆపడం కష్టమే అవుతుంది. మరి రెగ్యులర్ షోలకు సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here