Home న్యూస్ కొత్త సినిమాలే ఔట్….ఈ ఓల్డ్ మూవీ షోలు హౌస్ ఫుల్ ఏంటి సామి!!

కొత్త సినిమాలే ఔట్….ఈ ఓల్డ్ మూవీ షోలు హౌస్ ఫుల్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టడం ఎక్స్ లెంట్ హిట్ తో మొదలు పెట్టి బాక్ టు బాక్ 2 సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని ఎక్స్ లెంట్ స్టార్ట్ ను దక్కించుకున్నా కూడా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ లేక వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం జోరు చూపించ లేక…

కెరీర్ లో ఇప్పటికీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్న హీరోలలో ఒకరైన ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. కొత్త సినిమాలు చూడటానికి జనాలు పెద్దగా థియేటర్స్ కి తరలి రాలేదు…

కనీసం ఆక్యుపెన్సీ పరంగా కూడా కొత్త సినిమాలు ఏవి ఇంపాక్ట్ ని చూపించలేదు. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు ఆది సాయి కుమార్ నటించిన మొదటి సినిమా అయిన ప్రేమ కావాలి4K(Prema Kavali4K) మూవీ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు…

ఈ నెల 26న గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతూ ఉండగా ఆది సాయి కుమార్ కొత్త సినిమాలనే పట్టించుకోని ఆడియన్స్ ఇప్పుడు ప్రేమ కావాలి సినిమా విషయానికి వచ్చే సరికి సూపర్బ్ ఆక్యుపెన్సీతో బుకింగ్స్ పరంగా దూసుకు పోతూ ఉండగా హైదరాబాదు లో మెయిన్ సెంటర్స్ లో…

ఏకంగా హౌస్ ఫుల్స్ రీ రిలీజ్ కి ముందే కంప్లీట్ అయిపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది ఇప్పుడు….దసరా తర్వాత వచ్చిన కొత్త సినిమాలు సైతం పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయాయి. హౌస్ ఫుల్స్ కూడా ఏమి పడలేదు…అలాంటి అసలు ఫామ్ లోనే లేని…

ఆది సాయి కుమార్ నటించిన మొదటి సినిమా ప్రేమ కావాలి కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ క్రేజ్ ఏర్పడగా ఏకంగా కొన్ని షోలు హౌస్ ఫుల్ బోర్డులు కూడా రిలీజ్ కి ముందే పడుతూ ఉండటం విశేషం. ఇక సినిమా రీ రిలీజ్ లో ఓవరాల్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో…ఆది సాయి కుమార్ కెరీర్ కి తిరిగి జోరు ఎంతవరకు నింపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here