Home న్యూస్ 11 ఏళ్ళుగా హిట్ లేదు….కానీ ఇప్పటికీ జనాలు చూస్తున్నారు…60 మిలియన్స్ తో ఫ్లాఫ్ మూవీ...

11 ఏళ్ళుగా హిట్ లేదు….కానీ ఇప్పటికీ జనాలు చూస్తున్నారు…60 మిలియన్స్ తో ఫ్లాఫ్ మూవీ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ హిట్ కి దూరం అయిన హీరోలలో ఆది సాయి కుమార్ ఒకరు, కెరీర్ మొదట్లో ప్రేమ కావాలి, లవ్ లీ లాంటి బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న ఆదికి వరుస పెట్టి సినిమా అవకాశాలు సొంతం అయ్యాయి, కానీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదికి హిట్ ని అయితే ఇవ్వలేక పోయింది. చివరి హిట్ లవ్ లీ ఎప్పుడో 2012 టైంలో సొంతం అవ్వగా…

11 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు మరో హిట్ ని సొంతం చేసుకోలేక పోయాడు ఆది, కానీ సినిమా ఆఫర్స్ ఇప్పటికీ వస్తూ ఉండటం, జనాలు తన సినిమాలను డిజిటల్ లో టెలివిజన్ లో ఇప్పటికీ ఎంతో కొంత చూస్తూ ఉండటంతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆది.

లాస్ట్ ఇయర్ టాలీవుడ్ హీరోలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా నిలిచిన ఆది అందులో ఒక్కటి కూడా కొట్టలేదు కానీ అన్ని సినిమాలు డిజిటల్ లో మాత్రం రచ్చ చేస్తున్నాయి. తన CSI సనాతన్ మూవీ అటు ప్రైమ్ వీడియోలో ఇటు ఆహ వీడియోలో డిజిటల్ రిలీజ్ అవ్వగా…..

రెండు చోట్లా కలిపి ఆల్ మోస్ట్ 60 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైంని సొంతం చేసుకుంది. వ్యూస్ వైజ్ ప్రత్రీ వారం మేకర్స్ కి పెయిమేంట్ ఉంటుంది, ఆ లెక్కన తన మేకర్స్ కి ఇలా కూడా ఎంతో కొంత రెవెన్యూని జనరేట్ చేస్తున్నాడు ఆది, ఎటొచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గరే ఒక హిట్ సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది ఫ్యూచర్ లో ఏ సినిమా అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here