బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మంచి కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ క(Ka Movie Review) ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను అలాగే స్పెషల్ షోలను కంప్లీట్ చేసుకున్న సినిమా…
అక్కడ నుండి ఫస్ట్ టాక్ ను సొంతం చేసుకుంది….మొత్తం మీద మెయిన్ పాయింట్ ని ఏమి రివీల్ చేయడం లేదు కానీ ఓవరాల్ గా ఒక వింత ఊరికి పోస్ట్ మాస్టర్ గా వెళ్ళిన హీరోకి ఆ ఊర్లో వింత పరిస్థితులు ఎదురు అవ్వగా అనుకోకుండా ఒక లెటర్ తన దగ్గరకి వచ్చిన తర్వాత….
తన లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా అసలు పాయింట్ గా చెప్పొచ్చు…. ఫస్ట్ ఫ్రేమ్ నుండే ఆసక్తిని పెంచేలా ఓపెన్ అయిన సినిమా తర్వాత హీరో ఇంట్రో..వింత ఊరిలో తన లవ్ స్టోరీ….తో సరదా సరదాగా సాగిన సినిమా…
సడెన్ గా ట్విస్ట్ తో సినిమా టెంపో మారిపోయి సీరియస్ టర్న్ తీసుకున్నా ఆసక్తిని ఓ రేంజ్ లో పెంచేసేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా, సెకెండ్ ఆఫ్ కథ కొన్ని చోట్ల కొంచం డ్రాగ్ అయినా కూడా ఓవరాల్ గా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు…
మళ్ళీ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుని, ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ డిఫెరెంట్ అండ్ డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది అని చెప్పొచ్చు… మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో ఉండగా…
సెకెండ్ ఆఫ్ కూడా కొంచం కొన్ని చోట్ల స్లో అయినా ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ కూడా ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించగా కొన్ని ట్విస్ట్ లు బాగా వర్కౌట్ అవ్వడం సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి… మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైం కి….
పర్వాలేదు ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు అనిపించేలా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ అండ్ స్పెషల్ షోల తర్వాత ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇదే రేంజ్ లో టాక్ ను కామన్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది…