బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) మాస్ ఊచకోత కోస్తూ ఉండగా రెండో వీకెండ్ లో అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు ఇండియన్ మూవీస్ పరంగా కూడా బిగ్గెస్ట్ రికార్డులను అందుకుంటూ…
ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ ను అందుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతూ ఉంది. ఈ క్రమంలో సినిమా ఇప్పుడు ట్రేడ్ లెక్కల్లో 11 రోజులు పూర్తి అయ్యే టైంకి ఏకంగా 1300 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 1300 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…ఇది వరకు ఈ మమ్మోత్ రికార్డ్ ను 2017 టైంలో వచ్చిన ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి2 మూవీ పేరిట ఉండేది…
ఆల్ మోస్ట్ ఏడున్నర ఏళ్ళుగా ఈ రికార్డ్ ఇలానే ఉండగా ఇప్పుడు పుష్ప2 మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది….బాహుబలి 2 మూవీ 16వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 1300 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది..అంటే యావరేజ్ గా సినిమా…
ఒక్కో రోజుకి 82 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా దక్కించుకుందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు 11 రోజుల్లోనే 1300 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ ఫాస్టెస్ట్ 1300 కోట్ల గ్రాస్ రికార్డ్ ను అందుకుని మాస్ హిస్టీరియా క్రియేట్ చేసింది ఇప్పుడు…
యావరేజ్ గా సినిమా ఒక్కో రోజు ఇప్పుడు 118 కోట్లకు పైగా గ్రాస్ తో ఊహకందని రాంపెజ్ ను చూపెడుతుంది…సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఇదే రేంజ్ లో జోరు చూపిస్తే లాంగ్ రన్ లో మరిన్ని రికార్డుల భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.