హాలీవుడ్ మూవీస్ కి ఇండియా మొదటి నుండే మంచి క్రేజ్ ఉంది..ఇక్కడ భారీ బడ్జెట్ సినిమాల కన్నా కూడా ఎక్స్ లెంట్ క్వాలిటీతో వచ్చే హాలీవుడ్ మూవీస్ ని చూడటానికి ఇండియన్ ఆడియన్స్ ఇష్టపడతారు…ఈ క్రమంలో కొన్ని సినిమాలు మంచి విజయాలు నమోదు చేయగా 2019 టైంలో ఇండియాలో ది లయన్ కింగ్-సింబా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమా(Mufasa The Lion King Review in Telugu) వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మీద ఇక్కడ కూడా క్రేజ్ పెరిగిపోయింది… మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే…ది లయన్ కింగ్ లో సింబా నేపధ్యం చూపించగా, ముఫాసా ది లయన్ కింగ్ లో అసలు ముఫాసా ఎవరు, తన నేపధ్యం ఏంటి…వేరే జాతి సింహాలతో చేరి ఏకంగా రాజు ఎలా అయ్యాడు…ఈ క్రమంలో ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి అనేది సినిమా కథ పాయింట్..
లైఫ్ యాక్షన్ యానిమేషన్ మూవీ అవ్వడంతో అన్నీ విజువల్ పరంగా టాప్ నాట్చ్ అనిపించేలా ఆకట్టుకున్నాయి. విజువల్స్, గ్రాండియర్, గ్రాఫిక్స్ అన్నీ బాగా ఆకట్టుకున్నాయి…కొన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా మెప్పించినా కూడా మొదటి పార్ట్ రేంజ్ లో థ్రిల్ ఫీల్ రాలేదు….కథ ఒక ఫ్లోలో వెళుతుంది కానీ…
పెద్దగా ఆసక్తి ని పెంచేలా ఏమి అనిపించలేదు…చిన్న పిల్లలకు విజువల్స్ ఆకట్టుకోవచ్చు…ఇక మెయిన్ గా మహేష్ బాబు వాయిస్ ఓవర్ బాగానే సెట్ అయింది. తన నుండి కొత్త సినిమా రావడానికి టైం చాలా ఉండటంతో ఫ్యాన్స్ వాయిస్ ఓవర్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు….
ఇక మిగిలిన టాలీవుడ్ యాక్టర్స్ డబ్బింగ్ కూడా ఆకట్టుకుంది…మహేష్ వాయిస్ వలెనే తెలుగులో సినిమా కి క్రేజ్ ఏర్పడగా తన వరకు మహేష్ ఫుల్ న్యాయం చేసాడు…కానీ మొదటి పార్ట్ రేంజ్ లో కథలో డబ్బు రెండో పార్ట్ లో పెద్దగా లేనట్టు అనిపించింది కానీ…
చిన్న పిల్లలు ఈజీగా ఒకసారి చూసేలా ఉన్న సినిమా మిగిలిన ఆడియన్స్ కి ఇలాంటి గ్రాఫిక్స్ హంగులు ఆల్ రెడీ రీసెంట్ టైంలో అనేకం చూసే ఉన్నారు కాబట్టి ఓకే అనిపించవచ్చు. ఇక మహేష్ ఫ్యాన్స్ కి మాత్రం సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ తో బాగానే కిక్ ఇచ్చింది అని చెప్పాలి…
వీకెండ్ లో ఫ్యామిలీ పిల్లలతో కలిసి ఈజీగా చూసే అని చెప్పొచ్చు ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను….కానీ మొదటి పార్ట్ రేంజ్ లో అయితే ఎక్సైట్ అయ్యే రేంజ్ లో సినిమా లేదు…మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వెళ్లి ఒకసారి చూడొచ్చు.