కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ(UI Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో సినిమా మాస్ కుమ్ముడు కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా వీకెండ్ లో మంచి జోరుని చూపించగా, కర్ణాటకలో మాత్రం ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి ఈ ఇయర్ కన్నడ మూవీస్ పరంగా…
బెస్ట్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తుంది సినిమా….మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి జోరుని చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా మూడు రోజుల వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా ఇప్పుడు 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా షేర్ పరంగా సినిమా 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. తెలుగులో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా….
మిగిలిన రన్ లో స్టడీ హోల్డ్ ని కొనసాగిస్తే టార్గెట్ కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మూడో రోజు కర్ణాటకలో సినిమా 6.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా టోటల్ గా ఇప్పుడు 3 రోజుల్లో సినిమా…
వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
UI Movie 3 Days Total World Wide Collections Approx.
👉Karnataka – 19.90Cr
👉Telugu States – 2.55Cr
👉ROI – 0.45Cr
👉Overseas – 0.90Cr***approx.
Total WW collection – 23.80CR(11.45CR~ Share) Approx.
ఇదీ మొత్తం మీద సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా క్లీన్ హిట్ కోసం వరల్డ్ వైడ్ గా 35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన సినిమా వర్కింగ్ డేస్ లో తర్వాత క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ లో జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ అవకాశం ఉంటుందని చెప్పాలి.