Home న్యూస్ 24 గంటల్లో శాండల్ వుడ్ లో టాప్ 2 రికార్డ్ కొట్టిన కబ్జా!!

24 గంటల్లో శాండల్ వుడ్ లో టాప్ 2 రికార్డ్ కొట్టిన కబ్జా!!

1

కేజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. రీసెంట్ టైం లో కొన్ని మంచి హిట్ మూవీస్ నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకోగా కేజిఎఫ్ సిరీస్ తర్వాత అలాంటి కాన్సెప్ట్ అండ్ విజువల్స్ తో వస్తున్న సినిమా కబ్జా… ఉపేంద్ర హీరోగా కిచ్చ సుదీప్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా పై కన్నడలో మంచి అంచనాలు ఉండగా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో…

రిలీజ్ కానుందని ఆల్ రెడీ అనౌన్స్ చేయగా రీసెంట్ గా సినిమా టీసర్ ను రిలీజ్ చేశారు మేకర్స్…ఆ టీసర్ లో విజువల్స్ దాదాపుగా కేజిఎఫ్ సినిమాను తలపించేలా ఉండటంతో అందరూ ఈ సినిమా కేజిఎఫ్ సిరీస్ లో ఒక భాగం ఏమో అని…

అనుకుంటూ ఉండగా ఆ కంపారిజన్ వలన మరింత రీచ్ ను సొంతం చేసుకోగా అన్ని ఇండస్ట్రీలలో టీసర్ పై చర్చలు జరిగాయి. ఇక ఈ టీసర్ కి కన్నడ ఇండస్ట్రీ తరుపున 24 గంటల్లో ఆల్ టైం టాప్ 2 రేంజ్ లో వ్యూస్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి.

కేజిఎఫ్ 2 టీసర్ 88 మిలియన్స్ కి పైగా అప్ డేట్ వ్యూస్ ని 100 మిలియన్స్ కి పైగా రియల్ టైం వ్యూస్ సొంతం అవ్వగా ఇప్పుడు రెండో ప్లేస్ లో కబ్జా 12.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని అందుకుందట… దాంతో కన్నడ ఇండస్ట్రీ తరుపున టీసర్ల విషయంలో టాప్ 2 ప్లేస్ ను అందుకున్న ఈ సినిమా త్వరలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here