Home న్యూస్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ లో చేసిన లేటెస్ట్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్(Srikakulam Sherlock Holmes Movie) తో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రర్వాలేదు అనిపించేలా అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఆడియన్స్ ను కచ్చితంగా మెప్పిస్తుంది అంటూ మేకర్స్…

సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…ముందుగా కథ పాయింట్ కి వస్తే శ్రీకాకుళంలో షెర్లాక్ హోమ్స్ గా పేరున్న వెన్నెల కిషోర్ కి ఒక కేసు సాల్వ్ చేయాల్సిన ఆఫర్ వస్తుంది…ఆ కేసులో భాగంగా కొందరి మీద తనకి డౌట్ ఉంటుంది…

మరి ఆ కేసులో డౌట్ ఉన్న వారిలో ఎవరు అసలు నిందితుడు…ఆ విషయానికి వెన్నెల కిషోర్ ఎలా కనుక్కున్నాడు అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్…డిటెక్టివ్ తరహా సినిమాల్లో సస్పెన్స్ అన్నది చాలా కీలకం…అసలు విలన్ ఎవరూ అన్నది ఎంత లేట్ గా తెలిసింది అన్నది…

ఒక పాయింట్ అయితే….లేట్ గా తెలిసే క్రమంలో స్క్రీన్ ప్లే ఎంత టైట్ గా ఉందీ అన్నది చాలా ముఖ్యం అని చెప్పాలి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో ఒక దశలో మెయిన్ విలన్ ఎవరూ అన్నది ఒక ఐడియాకి వచ్చేసినా కూడా స్క్రీన్ ప్లే పరంగా చాలా వరకు ఆకట్టుకున్నాడు డైరెక్టర్…

కొన్ని చోట్ల ఫ్లో మిస్ అయినా కూడా శ్రీకాకుళం యాసతో వెన్నెల కిషోర్ బాగా అలరించాడు. కొన్ని సీన్స్ బాగా నవ్వించాయి…ఫస్టాఫ్ లో కామెడీ సీన్స్ కొన్ని చోట్ల ఆకట్టుకోగా కథ మాత్రం కొంచం స్లో నరేషన్ తో సాగినట్లు అనిపించినా అవసరం అయిన చోట స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది…

దాంతో పడుతూ లేస్తూ సినిమా సాగినట్లు అనిపించినా కూడా ఎండ్ అయ్యే టైంకి ఒక డీసెంట్ మూవీలా అనిపిస్తుంది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా….కానీ కొంచం స్లో నరేషన్ తో కాకుండా మరింత ఫాస్ట్ గా సినిమా నడిచి ఉంటే మట్టుకు ఇంకా బాగా మెప్పించేది సినిమా…

మొత్తం మీద అందరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా డైరెక్షన్ కూడా పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి…. చిన్న సినిమానే అయినా మంచి క్వాలిటీ తో నిర్మించారు… సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి….

ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చే అవకాశం ఉంది, రన్ టైం కొంచం తగ్గించి టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే సినిమా ఇంకొంచం మెప్పించేది…ఓవరాల్ గా చిన్న సినిమానే అయినా పర్వాలేదు అనిపించేలా మెప్పించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here