Home న్యూస్ చారి 111 మూవీ టాక్ ఏంటి….సినిమా ఎలా ఉందంటే!!

చారి 111 మూవీ టాక్ ఏంటి….సినిమా ఎలా ఉందంటే!!

0

కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) హీరోగా మారిన లేటెస్ట్ మూవీ చారి111(Chaari111 Movie Review) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ నుండే పర్వాలేదు అనిపించిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చాక ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ….

స్టొరీ పాయింట్ కి వస్తే రుద్రనేత్ర అనే ఏజెన్సీలో పనిచేసే ఏజెంట్ అయిన హీరో సిల్లీ పనులతో హెడ్ మురళీశర్మ తో చివాట్లు పడుతూ ఉండగా అనుకోకుండా ఒక హ్యూమన్ బాంబ్ ద్వారా దాడి జరుగుతుంది అని తెలుసుకోవడంతో హీరో ఏం చేశాడు తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద సినిమా స్టొరీ పాయింట్….

కథ లాంటివి ఏమి పట్టించుకోకుండా కొన్ని లైట్ కామెడీ సీన్స్ కోసం అయితే కొంచం పడుతూ లేస్తూ సాగినా కానీ ఉన్నంతలో చారి మూవీ పర్వాలేదు అనిపించే టైం పాస్ మూవీలా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ తన రోల్ వరకు బాగానే పెర్ఫార్మ్ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు…కొన్ని సీన్స్ సిల్లీగా అనిపించినా కూడా ఓవరాల్ గా పర్వాలేదు…

హిరోయిన్ తన రోల్ వరకు బాగానే పెర్ఫార్మ్ చేయగా ఇతర పాత్రలు పర్వాలేదు అనిపించాయి. సంగీతం యావరేజ్ గా ఉండగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించగా సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అయ్యింది… ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు…. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఓవరాల్ గా పాయింట్ చాలా రొటీన్ గానే అనిపించగా….

కొన్ని సీన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా చాలా వరకు సినిమా డ్రాగ్ అవుతూ బోర్ ఫీల్ ని కలిగిస్తుంది…. మొత్తం మీద సినిమా ముందే చెప్పినట్లు టైం పాస్ కోసం వెళితే కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించేలా ఉంటూ ఓవరాల్ గా యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here