బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలోనే ఊరమాస్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ దిశగా దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, అన్ని చోట్ల ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ రెండో వీకెండ్ లో అడుగు పెట్టి కొత్త సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ ఉండగా…
9వ రోజున ఫుల్ డామినేషన్ తో కుమ్మేసిన తర్వాత సినిమా 10వ రోజున సండే అడ్వాంటేజ్ కలిసి రావడం, ఇతర సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించక పోవడంతో మాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా 9వ రోజు మీద సినిమా కి డీసెంట్ గ్రోత్ ఉండగా…
ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ పరంగా కూడా ఈ గ్రోత్ కొనసాగే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా 2.2-2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా గ్రోత్ ని ఇలానే కొనసాగిస్తే…
ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన మేర జోరు చూపించ లేక పోతున్నా కూడా మేజర్ జోరు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూపెడుతూ ఉండగా… నైజాంలో ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తున్న సినిమా…
నైట్ షోలకు పెద్దగా డ్రాప్స్ కనుక లేకుంటే ఈ రోజు అనుకున్న అంచనాలను మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 10వ రోజు ఎండ్ అయ్యే టైం కి ఇదే రేంజ్ లో ట్రెండ్ అవుతుందా లేక ఇంతకుమించిన కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.