Home టోటల్ కలెక్షన్స్ మోహన్ లాల్ “బరోజ్3D” టోటల్ కలెక్షన్స్….ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

మోహన్ లాల్ “బరోజ్3D” టోటల్ కలెక్షన్స్….ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండ్ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) డైరెక్ట్ చేసిన సినిమా బరోజ్3D(Barroz3D Movie) కూడా ఒకటి కాగా…మొదటి ఆటకే డిసాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

ఏ దశలో కూడా ఇక తిరిగి తేరుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా….బడ్జెట్ పరంగా మలయాళ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా…

ఏకంగా 150 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందింది అని అంటూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో టోటల్ రన్ లో 55 లక్షల లోపే గ్రాస్ ను 25 లక్షల లోపే షేర్ ని అందుకోగా 2 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ ను అందుకోలేక భారీ డిసాస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా కేరళలో టోటల్ రన్ లో 10.20 కోట్ల రేంజ్ లో నే గ్రాస్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా 1 కోటి లోపే గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో టోటల్ రన్ లో 4.50 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది ఈ సినిమా…

దాంతో టోటల్ రన్ లో సినిమా వరల్డ్ వైడ్ గా 16.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకోగా షేర్ 7.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…వరల్డ్ వైడ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ బిజినెస్ లో కూడా భారీ లాస్ ను సొంతం చేసుకోగా…

ఓవరాల్ గా బడ్జెట్ పరంగా చూసుకుంటే మలయాళ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది లేదా ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా ఎపిక్ లాస్ ను సొంతం చేసుకుని దారుణంగా నిరాశ పరిచింది…. నాన్ థియేట్రికల్ బిజినెస్ అండ్ ఇతర బిజినెస్ లు ఎంత కలిపినా మేకర్స్ కి కూడా ఊహకందని లాస్ ను సినిమా సొంతం చేసుకున్నట్లు అంచనా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here