బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన మార్చి టైం లో పాజిటివ్ టాక్ పవర్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధిస్తూ వీకెండ్ మొత్తం తక్కువ డ్రాప్స్ తో దుమ్ము లేపి మూడో రోజు ఊహకందని లెవల్ లో గ్రోత్ ని సొంతం చేసుకుని సత్తా చాటిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 మూడు రోజుల్లో 5.3 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా సినిమా…
ఇప్పుడు నాలుగో రోజు లో ఎంటర్ అయ్యింది, మహా శివరాత్రి హాలిడే ఉండటం తో సినిమా మరో సారి కలిసి వచ్చింది అని చెప్పాలి. దాంతో సినిమా అన్ని ఏరియాల్లో మామూలు డ్రాప్స్ తోనే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల లో కలెక్షన్స్ ని సాధిస్తుంది.
సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో కేవలం 30% టు 35% వరకు డ్రాప్స్ ని మాత్రమె మూడో రోజు తో కంపేర్ చేస్తే డ్రాప్ అయింది, దాంతో నాలుగో రోజు ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టే సినిమా మరోసారి అవలీలగా 1 కోటి కి పైగా షేర్ ని అందుకోవడం పక్కా అని చెప్పాలి.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అనుకున్న రేంజ్ లో గ్రోత్ ఉంటే కచ్చితంగా సినిమా 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ లో జరిగే టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క తగ్గడమో లేక మరింత…
పెరగడమో జరుగుతుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద నాలుగో రోజు కలెక్షన్స్ తో సినిమా బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అవ్వడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. నాలుగో రోజు డే ఎండ్ సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందొ మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.