Home న్యూస్ కళ్యాణ్ రామ్ బర్త్ డే…24 గంటల్లో దుమ్ము లేపిన ఫ్యాన్స్

కళ్యాణ్ రామ్ బర్త్ డే…24 గంటల్లో దుమ్ము లేపిన ఫ్యాన్స్

0

2003 లో టాలీవుడ్ లో తొలి చూపులోనే సినిమా తో పరిచయం అయిన నందమూరి కళ్యాణ్ రామ్ తొలి హిట్ ని 2005 లో అతనొక్కడే సినిమా తో సొంతం చేసుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి అల్టిమేట్ బూస్టప్ ఇచ్చింది కానీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ విజయం కళ్యాణ్ రామ్ కి అస్సలు పడలేదు. ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో…

ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రశంసలు దక్కాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు మాత్రం అనుకున్న రేంజ్ లో రాలేదు. ఇలాంటి టైం లో దాదాపు 10 ఏళ్ల తర్వాత తిరిగి సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో…

వచ్చిన పటాస్ 2015 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సెన్సేషనల్ కంబ్యాక్ అయ్యేలా చేసింది. మళ్ళీ అడపాదడపా సినిమాలు చేసినా హిట్స్ కి దూరంగా ఉన్న టైం లో లాస్ట్ ఇయర్ 118 మూవీ తో మళ్ళీ సక్సెస్ సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ఎంతమంచి వాడవురాతో మళ్ళీ అంచనాలు తప్పాడు.

అయినా కానీ మంచి సినిమా పడితే మినిమం 20 కోట్ల రేంజ్ షేర్ వసూల్ చేసే సత్తా ఉన్న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు నేడు. దాంతో సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు భారీ ట్రెండ్ చేయగా 24 గంటల్లో ఆల్ మోస్ట్ 2 లక్షల 77 వేల కి పైగా ట్వీట్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపారు ఫ్యాన్స్…

టాలీవుడ్ లో టైర్ 2 హీరోల టాప్ లిస్టులో ఇప్పుడు 3 వ ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్… ఈ లిస్టులో ఒకసారి టాప్ మూవీస్ ని గమనిస్తే…
1. #HappyBirthdayRAPO – 646k~
2. #HBDVijayDeverakonda: 445.3K
3. #HBDNandamuriKalyanRam – 277K~***

4. #HBDAkhilAkkineni: 265.4K
5. #HappyBirthdayNani: 248K
6. #HBDNagachaitanya : 225K
లిస్టులో ఉన్న ఇతర హీరోల తో పోల్చితే రేసులో చాలా వెనుకబడ్డ కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఈ లిస్టులో ఉన్న హీరోలతో ఫ్యూచర్ లో పోటి పడతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here