Home న్యూస్ దేవదాస్ రివ్యూ–(నాగ్-నాని) కుమ్మారు కానీ

దేవదాస్ రివ్యూ–(నాగ్-నాని) కుమ్మారు కానీ

0

నాగార్జున మరియు నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది…మల్టీ స్టారర్ అవ్వడంతో అంచనాల పరంగా మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇద్దరు హీరోలకు ఎంతవరకు కలిసి వచ్చిందో తెలుసుకుందాం పదండీ…

కథ: ముందుగా కథ విషయానికి వస్తే…మాఫియా లో పనిచేసే దేవ కి అనుకోకుండా ఒకసారి యాక్సిడెంట్ జరుగుతుంది…అప్పుడు అనుకోకుండా అక్కడ ఉన్న డాక్టర్ దాస్ ఎలాంటి పోలీస్ కేసులు లేకుండానే దేవకి ట్రీట్ మెంట్ చేస్తాడు. తర్వాత అది తెలుసుకున్న దేవ దాస్ తో స్నేహం చేయడం మొదలు పెడతాడు…తర్వాత ఇద్దరి లవ్ స్టోరీ లు చెప్పుకోవడం, ఎలా లవ్ ను ఎలా తిరిగి పొందారు అన్నది మిగిలిన కథ.

పెర్ఫార్మెన్స్: నాగార్జున చివరి సారి ఊరమాస్ గా దుమ్ము లేపిన సినిమా రగడ…రఫ్ అండ్ టఫ్ యాటిట్యూడ్ తో అదరగొట్టేశాడు ఆ సినిమాలో…మళ్ళీ ఇప్పుడు దేవదాస్ లో నాగ్ రోల్ భీభత్సంగా హైలెట్ అయ్యింది…సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాగార్జుననే అని చెప్పాలి.

ఇక నాని తన రొటీన్ మూవీస్ కి భిన్నంగా ఈ సారి సటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు…నాగ్ అండ్ నాని ల సీన్స్ కొన్ని హిలెరియస్ గా ఉన్నాయి…ఇక హీరోయిన్స్ ఇద్దరికీ నటించడానికి పెద్దగా స్కోప్ లేకున్నా ఇద్దరు ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా ఆకట్టుకున్నారు.

విశ్లేషణ: కథ అంట పకడ్బందీగా లేదు…కానీ స్క్రీన్ ప్లే పరంగా చాలా సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి…కథ మరింత గట్టిగా ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేది…మొదటి అర్ధభాగంలో కొన్ని బోర్ సీన్స్ ఉన్నా చాలా ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ ఆ బోర్ సీన్స్ ని మరిపించాయి.

కానీ సెకెండ్ ఆఫ్ విషయంలో కొన్ని సీన్స్ భారీ గా డ్రాగ్ అవ్వడంతో సినిమా గాడి తప్పిన ఫీలింగ్ కలిగింది..అప్పటికే ప్రేక్షకులు చాలా వరకు సాటిస్ ఫై అవ్వడంతో ఆ మైనస్ పాయింట్స్ ని ఎంతమంది పట్టించుకోకుండా ఉంటారో అన్నది ఆసక్తికరం.

హైలెట్స్: నాగార్జున, నాగార్జున-నాని సన్నివేశాలు, కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్: స్టోరీ బలంగా లేక పోవడం, సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టడం

ఫైనల్ గా: అక్కినేని ఫ్యాన్స్ కి నాగార్జున ని ఇలా ఫుల్ ఎనర్జీతో చూడటం పండగే అని చెప్పాలి…అలాగే నాగార్జున అండ్ నాని ల సన్నివేశాలు కనుల పండగగా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి, అభిమానులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయి..కొన్ని బోర్ సీన్స్ అండ్ స్లో సన్నివేశాలు ప్రేక్షకులు ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటారు అన్నదాని పై సినిమా రేంజ్ ఎంతో తెలుస్తుంది.

T2B Live రేటింగ్: 2.75/5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here