విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ డియర్ కామ్రేడ్ మంచి అంచనాల నడుమ మరి కొన్ని గంటల్లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందే మొదలు అయినా అన్ని సెంటర్స్ లో 4 రోజుల ముందు నుండి నాన్ స్టాప్ గా బుకింగ్స్ జరిగాయి. కాగా సినిమా నైజాం ఏరియాలో అల్టిమేట్ లెవల్ లో బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.
కాగా ఈ ఏరియా లోనే సినిమా మొదటి రోజు 3 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు, ఇక ఆంధ్రా లో బుకింగ్స్ బాగానే ఉండగా సీడెడ్ లో మాత్రం బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. దాంతో ఇప్పటి వరకు ఓవరాల్ బుకింగ్స్ 55% కి పైగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా ప్రీమియర్ షోల నుండి టాక్ బాగుంటే షో షో కి బుకింగ్స్ ఓ రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 6 కోట్లు మినిమం వసూల్ చేసే చాన్స్ ఉంది, ఇక మాగ్జిమం అయితే 8 కోట్లకు పైగా షేర్ ని టాక్ బాగుంటే అందుకునే అవకాశం ఉంది.
ఇక ఇతర భాషల ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గా ఉంటే వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు మినిమం 10 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సాధించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక టాక్ అద్బుతంగా ఉంటే ఈ లెక్క మరింత పెరిగే చాన్స్ ఉంది. మొత్తం మీద సినిమా…
35.6 కోట్ల టార్గెట్ తో సుమారు 1500 వరకు థియేటర్స్ లో అన్ని భాషల్లో కలిపి భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది, సినిమా కి కావాల్సింది అల్లా కేవలం పాజిటివ్ టాక్ మాత్రమె, అది వచ్చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ మ్రోత మ్రోగించడం ఖాయమని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.