బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా మార్నింగ్ షోల సమయానికి వీక్ ఓపెనింగ్స్ నే సాధించింది, ఇతర సినిమాల ఎఫెక్ట్ ఉండటం తో ఓపెనింగ్స్ జోష్ తగ్గినా సినిమా టాక్ బాగుండటం తో సినిమా మొదటి రోజు మార్నింగ్ షోల తర్వాత మ్యాట్నీ షోల నుండి షో షో కి మంచి జోష్ చూపుతూ కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్ళ దిశగా అడుగులు వేసింది.
ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి క్లాస్ సెంటర్స్ లో కుమ్మేసిన ఈ సినిమా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించుకుంది. కొన్ని సెంటర్స్ లో వర్షాలు కూడా కొంచం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా మొదటి రోజు మొత్తం మీద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది ఈ సినిమా.
మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్నీ అనుకున్నట్లు ఉంటే 2.5 కోట్లకు పైగానే సినిమా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 3 కోట్ల రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం.
దాంతో కొన్ని ఇబ్బందులు ఎదురు అయినా సినిమా మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేసిందని చెప్పొచ్చు. ఇక వీకెండ్ లో సినిమా రోజు ఇలాంటి కలెక్షన్స్ తో జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అప్పుడే సినిమా సాధించాల్సిన టార్గెట్ 17.2 కోట్ల ని త్వరగా అందుకునే చాన్స్ ఉంది.
కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల కి పక్కా యునానిమస్ పాజిటివ్ టాక్ ఉన్న సినిమా ను సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.