కోలివుడ్ స్టార్ హీరోలలో అల్టిమేట్ మాస్ క్రేజ్ ఉన్న హీరోలలో అజిత్ కుమారు ఒకరు, అభిమానులు తల అంటూ ముద్దుగా పిలుచుకునే అజిత్ రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా మొదటి సారి గెస్ట్ రోల్ లో సీరియస్ కథ తో తెరకెక్కిన నేర్కొంద పార్వై అనే సినిమా లో కనిపించారు. 8 వ తేదిన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల వీకెండ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.
చాలా సీరియస్ కథ అయినా కానీ అజిత్ రోల్ తో సినిమా పై మాస్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడగా సినిమా బిజినెస్ కూడా ఏకంగా 60 కోట్ల దాకా అయినట్లు సమాచారం. కాగా సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కగా అజిత్ రోల్ లో కొన్ని…
మార్పులు చేశారు. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో తమిళనాడు లో 48 కోట్ల గ్రాస్ ని, కర్ణాటకలో 2.7 కోట్ల గ్రాస్ ని, కేరళలో 1.3 కోట్ల గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ మొత్తం మీద 13 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుందట.
దాంతో 4 రోజుల వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ 66 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా, అందులో షేర్ సుమారు 36 కోట్లకు పైగా ఉంటుందని అంచనా… కేవలం ఎక్స్ టెండేడ్ క్యామియో చేసినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ ని చూసి…
ట్రేడ్ కూడా షాక్ అవుతుంది, అజిత్ మాస్ ఫాలోయింగ్ ఈ రేంజ్ లో ఉందొ అని అనుకుంటున్నారు. ఇక సినిమా బిజినెస్ 60 కోట్ల రేంజ్ లో ఉంటడం తో బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 24 కోట్ల దాకా వసూల్ చేస్తే సరిపోతుంది, రెండో వీకెండ్ లోపే ఈ మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.