Home న్యూస్ వాల్మీకి(గద్దలకొండ గణేష్) రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

వాల్మీకి(గద్దలకొండ గణేష్) రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున నేడు రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సినిమా కి పాజిటివ్ టాక్ లభించగా రెగ్యులర్ షోల నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది. ఎఫ్ 2 తర్వాత ఈ సినిమా తో వరుణ్ తేజ్ మరో హిట్ కొట్టాడో లేదో తెలుసు కుందాం పదండీ..

స్టొరీ విషయానికి వస్తే…. అప్ కమింగ్ డైరెక్టర్ అయిన అతర్వ ఒక రియల్ లైఫ్ ఫాక్షన్ స్టొరీ డైరెక్ట్ చేయాలి అనుకుని గద్దల కొండ గణేష్ గురించి తెలుసుకుని అతన్ని ఫాలో అయ్యి కథ సిద్ధం చేసుకునే పనిలో ఉండగా ఆ విషయం తెలుసుకున్న గణేష్ అతర్వ ని ఏం చేశాడు అన్నది అసలు కథ.

మెయిన్ ప్లాట్ ఇదే అయినా సినిమా లో మరిన్ని ఉప కథలు ఉంటాయి అవి ఆకట్టుకునేలా ఉంటాయి, వరుణ్ తేజ్ నటన, పెర్ఫార్మెన్స్, నెగటివ్ షేడ్స్, డైలాగ్స్ ఇలా సినిమా కి బిగ్గెస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అయ్యాడు వరుణ్ తేజ్, అతర్వ తెలుగు లో మొదటి సినిమా అయినా మెప్పిస్తాడు కానీ ఎవరైనా తెలుగు యాక్టర్ ని పెట్టుకుని ఉంటే ఇంపాక్ట్ మరింత ఎక్కువ ఉండేది.

ఇక పూజ హెడ్గే ఆకట్టుకోగా ఎల్లువచ్చి గోదారమ్మా సాంగ్ లో ఆదరగోట్టేసింది. మరి కొత్త హీరోయిన్ కూడా ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకుంటాయి. ఇక సంగీతం విషయానికి వస్తే క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మిక్కీ జే మేయర్ నుండి మాస్ సాంగ్స్ ని ఈ రేంజ్ లో ఎవ్వరూ…

అంచనా వేసి ఉండరు, మిక్కీ జే మేయర్ ఆ విషయం లో ఓ రేంజ్ లో ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరో లెవల్ లో ఇచ్చి సినిమా రేంజ్ ని బాగా పెంచాడు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా స్లో నరేషన్ అండ్ సెకెండ్ ఆఫ్ ఎండ్ టైం స్క్రీన్ ప్లే…

కొంచం వీక్ గా అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, డైరెక్షన్ విషయానికి వస్తే ఒరిజినల్ కథ పాయింట్ ని తీసుకుని తెలుగు ఆడియన్స్ కి నచ్చే మార్పులు చేర్పులు చేసి మెప్పించాడు హరీష్ శంకర్, సినిమా లో చాలా వరకు అనుకున్నది తీసి మెప్పించాడు.

క్లైమాక్స్ అలాగే స్లో నరేషన్ ని కొద్దిగా తగ్గించి లెంత్ కొంచం తక్కువ ఉండేలా చూసుకుంటే సినిమా రేంజ్ మరింత ఎక్కువగా ఉండేది అని చెప్పాలి. ఇక సినిమా కి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా ప్లస్ పాయింట్స్…

వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్
సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్
ఎల్లువచ్చే గోదారమ్మా & జర్రా జర్రా సాంగ్స్
ఇంటర్వెల్ బ్యాంగ్
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
లెంత్ ఎక్కువ అవ్వడం
స్లో నరేషన్
ఇవి తప్పితే సినిమా లో పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే ఏమి లేవు అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా పెర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ మూవీ…

సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…. మాస్ ఆడియన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంది.. వరుణ్ తేజ్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here