బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్మీకి (గద్దల కొండ గణేష్) జోరు మూడో రోజు కూడా కొనసాగుతుంది, సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 10.8 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సత్తా చాటుకోగా మూడో రోజు కూడా దుమ్ము లేపుతూ రెండో రోజు తో పోల్చుకుంటే మూడో రోజు డ్రాప్స్ కేవలం 25% రేంజ్ లో నే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షో లకు ఉండటం విశేషం కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో…
గ్రోత్ కంటిన్యు అవ్వగా అది ఆన్ లైన్ టికెట్ సేల్స్ వరకు కొనసాగింది, మాస్ సెంటర్స్ లో కొంచం డౌన్ అయినట్లు తెలుస్తుంది, దానికి కారణం ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్ ఉండటం అలాగే టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైనా…
సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటం వలన కొద్దిగా ఎఫెక్ట్ కనిపించింది, కానీ అది అన్ని సెంటర్స్ లో కాదని చెప్పోచ్చు. అయినా కానీ మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా 2.8 కోట్ల రేంజ్ నుండి 3 కోట్ల లోపు షేర్ ని.. మూడో రోజు అందుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు.
ఇక ఆఫ్ లైన్ సేల్స్ తో పాటు మాస్ సెంటర్స్ లో నైట్ షోల కంప్లీట్ రిపోర్ట్ అనుకున్న రేంజ్ లో ఉంటె సినిమా మూడో రోజు 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మూడు రోజుల్లో 14 కోట్ల రేంజ్ షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవచ్చు.
దాంతో బిజినెస్ లో సగానికి పైగా మొత్తాన్ని వీకెండ్ లోనే వెనక్కి రాబట్ట బోతుంది ఈ సినిమా, ఇక సోమవారం నుండి వర్కింగ్ డేస్ అవ్వడం తో ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అన్న దాని పై లాంగ్ రన్ లో ఎంతవరకు సినిమా కలెక్షన్స్ ని అందుకుంటుందో అంచనా వేయవచ్చు. ఇక వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.