బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను అల్టిమేట్ లెవల్ లో 15 కోట్లకు పైగా షేర్ ని అందుకుని మాస్ సెంటర్స్ లో సాలిడ్ గా హోల్డ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) ఇప్పుడు మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ వసూళ్లు అందుకోగా నాలుగో రోజు….
డ్రాప్స్ కూడా అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు తో పోల్చితే నాలుగో రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 60% వరకు ఉన్నట్లు సమాచారం, క్లాస్ సెంటర్స్ స్లో అవ్వగా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సినిమా సాధించింది.
కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ కొంచం బెటర్ గా ఉండటం తో నైట్ షోల సమయానికి సినిమా గ్రోత్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న డ్రాప్స్ ని బట్టి చూస్తె మాత్రం నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల లోపు షేర్ రావచ్చు.
కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ బాగుండి, మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు పెరిగితే ఈ లెక్క 1.5 కతోల నుండి 1.6 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, గ్రోత్ అంతకి మించి వెళితే కనుక సినిమా 1.8 కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి.
లాస్ట్ వీక్ రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ 4 వ రోజు 1.18 కోట్ల తోనే సరిపెట్టుకుంది, కానీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) మాస్ మూవీ అవ్వడం తో ఆ సెంటర్స్ లో హోల్డ్ చేస్తుంది కాబట్టి రోజు ముగిసే సరికి మంచి వసూళ్ళతో హోల్డ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి రోజు ముగిసే సరికి స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.