కోలివుడ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న సూర్య ప్రస్తుతం మినిమం కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోతున్నాడు, సూర్య నటించిన లేటెస్ట్ మూవీ బందోబస్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా తెలుగు వర్షన్ వరకు తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా మొత్తం మీద 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ అప్ డేట్ ఇలా ఉంది…
#BandoBast Day 3 Ap-TG: 0.38Cr
?Total 3 Days ApTg Collections: 1.68Cr
?Break Even : 10cr
Need: – 8.32Cr For Break Even
?Total Gross: 2.75Cr~
తెలుగు లో సినిమాను 9 కోట్లకు అమ్మగా 10 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ లోనే చేతులెత్తేసింది.
ఇక సినిమా మూడు రోజులకు గాను తమిళ్ అలాగే తెలుగు వర్షన్స్ టోటల్ కలిపి వరల్డ్ వైడ్ గ్రాస్ వివరాలను ఒకసారి గమనిస్తే
TamilNadu: 23Cr
AP TG: 2.75Cr
Kerala: 5.6Cr
Ka & ROI: 3.2
USA- 90L
UAE-GCC: 4.30cr
ROW: 3.1Cr
Total : 42.85Cr Gross ఇదీ మొత్తం మీద 3 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్…
ఈ గ్రాస్ కలెక్షన్స్ లో టోటల్ షేర్ సుమారు 24 కోట్ల వరకు తమిళ్ అండ్ తెలుగు కలిపి వచ్చాయట. కాగా సినిమా ను తమిళ్ వర్షన్ కలిపి 53.5 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా టోటల్ గా గ్రాస్ 100 కోట్ల నుండి 105 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
కాగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 62 కోట్ల దాకా గ్రాస్ ని మినిమం సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది, తెలుగు లో కుదరదు కానీ తమిళ్ అండ్ కేరళ లో స్టడీ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి జోరు లాంగ్ రన్ లో కొనసాగితే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.