మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ముగించుకుంది, సినిమా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించింది కానీ అది పూర్తిగా అంచనాలను అందుకోలేదు. కానీ ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.
సినిమా ముందుగా 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సాధించిన షేర్ 59 లక్షలు కాగా ఏరియాల వారి షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..
?Nizam: 24L
?Ceeded: 13L
?UA: 5.6L
?East: 4.1L
?West: 3L
?Guntur: 3.8L
?Krishna: 2.8L
?Nellore: 2.6L
AP-TG Day 7:- 0.59Cr
ఇక వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ వివరాలు ఏరియాల వారిగా ఇలా ఉన్నాయి..
?Nizam: 6.68Cr
?Ceeded: 2.91Cr
?UA: 2.13Cr
?East: 1.39Cr
?West: 1.21Cr
?Guntur: 1.52Cr
?Krishna: 1.18Cr
?Nellore: 69L
AP-TG Total:- 17.70Cr
Ka & ROI: 1.35Cr
OS: 1.45Cr
Total: 20.50Cr(32.3Cr Gross)
సినిమాను టోటల్ గా 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద మొదటి వారం 20.5 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ మొత్తం మీద 32.3 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక రెండో వారం నుండి ఇప్పుడు…
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సాధిస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుంటుంది. ఈ వారం ఎలాగు కొత్త సినిమాలు లేవు కాబట్టి వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమాకి ఇది అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు ఈ అడ్వాంటేజ్ ని వాడుకుంటుందో చూడాలి.