Home న్యూస్ యాక్షన్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

యాక్షన్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

0

     కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు, లాస్ట్ ఇయర్ ఇక్కడ అభిమన్యుడు మరియు పందెం కోడి 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న విశాల్ ఈ ఇయర్ టెంపర్ తమిళ్ రీమేక్ తెలుగు డబ్ అయోగ్య తో కూడా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు యాక్షన్ అంటూ సుందర్ సి డైరెక్షన్ లో తన కెరీర్ లోనే 57 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మరి విశాల్ ఎంతవరకు ఆకట్టుకున్నాడో లేదో తెలియాలి అంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే. ముందుగా కథ పాయింట్ కి వస్తే మిలటరీ మేజర్ అండ్ సీఎమ్ కొడుకు అయిన హీరో అనుకోని పరిస్థితుల్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ లో తన ఫ్యామిలీ లో చాలా మంది ని కోల్పోతాడు.

తర్వాత అసలు ఆ టెర్రరిస్ట్ ఎవరు, హీరో ఫ్యామిలీ కి ఆ టెర్రరిస్ట్ కి లింక్ ఏంటి, ఆ టెర్రరిస్ట్ ని హీరో ఎలా పట్టుకున్నాడు, అసలు తమన్నా రోల్ ఏంటి అనేది మొత్తం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశాల్ తన నటనతో ఆకట్టుకోగా…

ఫైట్ సీన్స్ లో అద్బుతమైన స్టంట్స్ తో దుమ్ము లేపాడు, తమన్నా రోల్ అటు యాక్షన్ ఇటు గ్లామర్ రెండూ కవర్ చేసి ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకుంటాయి. ఇక సంగీతమ్ యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరీ ఎఫెక్టివ్ గా లేదు కానీ పర్వాలేదు అనిపిస్తుంది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగా ఉండగా, సెకెండ్ ఆఫ్ మొదటి 20-25 నిమిషాలు కూడా ఆకట్టుకుంటుంది, కానీ తర్వాత పూర్తిగా స్లో అయ్యి ఫస్ట్ చూసిన సినిమా మొత్తం మీద మెల్లి మెల్లిగా ఇంట్రెస్ట్ పోయేలా చేస్తుంది, దానికి తోడూ ఇలాంటి రా ఏజెంట్ మూవీస్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ లు లాంటివి ఎక్స్ పెర్ట్ చేయడం కామన్ కానీ…

ఎలాంటి ట్విస్ట్ లు లాంటివి లేకుండా చాలా వీక్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది, దాంతో ఫస్టాఫ్ ఇచ్చిన మంచి ఇంప్రెషన్ ని సెకెండ్ ఆఫ్ క్యారీ చేయలేక పోతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉండగా సినిమా పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. ఇక డైరెక్షన్ పరంగా…సుందర్ సి…

రొటీన్ కథనే ఎంచుకున్నా మొదటి అర్ధభాగం వరకు ఆకట్టుకున్నా సెకెండ్ ఆఫ్ ని సరిగ్గా డీల్ చేయలేక పోయాడు, అక్కడక్కడా అక్షయ్ కుమార్ బేబీ సినిమా ని కూడా గుర్తు చేస్తుంది యాక్షన్ సినిమా. ఓవరాల్ గా డైరెక్షన్ వీక్ గా ఉందని చెప్పొచ్చు.

ఇక మొత్తం మీద సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…
విశాల్ పెర్ఫార్మెన్స్
యాక్షన్ సీన్స్
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
తమన్నా గ్లామర్
ఫస్టాఫ్ అని చెప్పొచ్చు
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
లెంత్ ఎక్కువ అవ్వడం
సెకెండ్ ఆఫ్ స్లో డౌన్ అవ్వడం
డైరెక్షన్ వీక్ గా ఉండటం
కథ లో దమ్ము లేక పోవడం మేజర్ మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

అయినా కానీ విశాల్ పడ్డ కష్టానికి సినిమా సెకెండ్ ఆఫ్ కొంచం వీక్ గా ఉన్నా ఉన్నంతలో ఈజీ గా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంటుంది, అందుకని సినిమా కి మా రేటింగ్ [2.75 స్టార్స్]… విశాల్ ఫ్యాన్స్ కి రొటీన్ మూవీ గోర్స్ కి సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంది. మిగిలిన ఆడియన్స్ ఒక ట్రై వేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here