జబర్దస్త్ తో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అడపా దడపా సినిమాల్లో సైడ్ రోల్స్ తో పాటు చిన్నా చితకా సినిమాల్లో హీరోగా కూడా చేశాడు కానీ పక్కా గా అన్ని సెట్ చేసుకుని మంచి కాస్ట్ అండ్ క్రూ తో మాత్రం రీసెంట్ గా సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బడ్జెట్ ఓవరాల్ గా 2 కోట్లకు పైగానే అయిందని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సైలెంట్ గా రిలీజ్ అయినా కలెక్షన్స్ పరంగా 10 రోజులు ముగిసే సరికి సాలిడ్ కలెక్షన్స్ నే సాధించింది, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ఇలాంటి వసూళ్ళ ని సాధించడం విశేషం అనే చెప్పాలి. యూనిట్ వర్గాలు 6 కోట్లకు పైగా వసూళ్లు అంటూ…
పోస్టర్స్ వదిలినా అవి ప్రమోషన్ వరకు మాత్రమె. రియాలిటీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 1.19 కోట్ల షేర్ ని 10 రోజుల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.30 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి మంచి వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 45L
?Ceeded: 15L
?UA: 21L
?East: 9.6L
?West: 6L
?Guntur: 8.8L
?Krishna: 8.90L
?Nellore: 4.5L
AP-TG Total:- 1.19CR??
Ka & ROI: 0.05Cr
OS: 0.06Cr
Total: 1.30Cr(2.25Cr Gross)
ఇదీ మొత్తం మీద సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
ఓవరాల్ గా సినిమా బిజినెస్ ఎంత అనేది రివీల్ కాలేదు కానీ ట్రేడ్ లెక్కల్లో సినిమా బిజినెస్ 1.8 కోట్ల రేంజ్ లో జరిగిందట. దాంతో హిట్ గీత కోసం 2.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది, సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అవ్వడం తో ఓవరాల్ గా ఫ్లాఫ్ లేక బిలో యావరేజ్ గా పరుగును ముగించనుంది ఈ సినిమా. అయినా హీరోగా మొదటి సినిమాతో ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఇంత వసూల్ చేయడం గొప్పే అని చెప్పాలి.