Home న్యూస్ ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ- ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ- ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

       యంగ్ హిరో నాగశౌర్య ఛలో సూపర్ హిట్ తర్వాత స్లో డౌన్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ టైం లో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు, ఇలాంటి టైం లో తన ఓన్ బ్యానర్ లో తన కథ తోనే ‘అశ్వథ్థామ’ అనే సినిమా ను తెరకెక్కించి నేడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ను తీసుకు వచ్చాడు. వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే ఫ్యామిలీ తో హ్యాప్పీ గా ఉండే హిరో లైఫ్ లో ఒక అనుకోని సంఘటన తన చెల్లికి చేరుగుతుంది, దానికి కారణం ఒక సైకో అని తెలుస్తుంది, అతని వల్ల మరింత మంది అమ్మాయిలకు ఇబ్బంది కలగగా…

హిరో ఆ సైకో అంతు చూడటం ధ్యేయంగా పెట్టుకుంటాడు. మరి ఆ విలన్ ఎవరు? హిరో ఆ విలన్ ని ఎలా కనుగున్నాడు. తర్వాత హిరో కి విలన్ కి మధ్య పోటి ఎలా ఉంది అన్నది అసలు సిసలు కథ.  పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… లవర్ బాయ్ ఇమేజ్ నుండి యాక్షన్ హిరో ఇమేజ్ కోసం ట్రై చేసిన నాగశౌర్య…

సక్సెస్ అయ్యాడు….తన లుక్స్ యాక్షన్ సీన్స్ లో ఈజ్ బాగా కుదిరాయి. తానె కథ రాసుకున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ ఎలివేషన్స్ పడాలో అవి పడ్డాయి. ఇక హిరో ని మించి సెకెండ్ ఆఫ్ లో విలన్ రోల్ చేసిన వ్యక్తీ దుమ్ము లేపేశాడు. తన పెర్ఫార్మెన్స్ సెకెండ్ ఆఫ్ కి హైలెట్ అని చెప్పాలి.

ఇక హీరోయిన్ మేహ్రీన్ ఉన్నంతలో జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన నటీనటులు అందరు పర్వాలేదు అనిపిస్తారు. ఇక సంగీతం వీక్ గా అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పిస్తుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు చాలా స్లో గా సాగుతుంది.

కానీ అదే సమయం లో సెకెండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది… హిరో విలన్ మధ్య పోటాపోటీ సీన్స్ క్లైమాక్స్ ఎపిసోడ్ లు మెప్పిస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ పరంగా ఫస్టాఫ్ టేకాఫ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు డైరెక్టర్…

ఇంతలో లైట్ కామెడి ఫ్యామిలీ సీన్స్ ని ఎస్తాబ్లేష్ చేసినా అవి అంతంత మాత్రమె కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ నుండి సినిమా గ్రిప్పింగ్ గా మారగా సెకెండ్ ఆఫ్ మెప్పిస్తుంది. ఓవరాల్ గా ఫస్టాఫ్ వరకు మరింత కేర్ తీసుకుని ఉంటె మరింత బాగుండేది.

ఓవరాల్ గా హైలెట్స్ విషయానికి వస్తే… యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, సెకెండ్ ఆఫ్ హిరో విలన్ మైండ్ గేమ్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ లో ఫస్టాఫ్ టేకాఫ్ టైం, హిరో హీరోయిన్స్ లవ్ స్టొరీ వీక్ గా ఉండటం, సాంగ్స్ సినిమా కి అడ్డుకట్టలా అనిపించడం మేజర్ మైనస్ పాయింట్స్.

ఉన్నంతలో సినిమా మరీ అద్బుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కానీ ఫస్టాఫ్ వరకు కొంచం ఓపిక తో చూసి ఇంటర్వెల్ నుండి మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా బాగుంది లే అనిపిస్తుంది, ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా..

మొత్తం మీద మా రేటింగ్ [2.75 స్టార్స్] ఇవ్వొచ్చు. ఇలాంటి సైకో థ్రిల్లర్ జానర్ మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా చూడరు కాబట్టి, రెగ్యులర్ ఆడియన్స్ అండ్ యూత్ ఎంతవరకు ఆదరిస్తారు అన్నదానిపై సినిమా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here