Home TRP రేటింగ్ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్….టెలివిజన్ లో బ్లాక్ బస్టర్…3వ సారి సాలిడ్ TRP!!

బాక్స్ ఆఫీస్ ఫ్లాప్….టెలివిజన్ లో బ్లాక్ బస్టర్…3వ సారి సాలిడ్ TRP!!

0

ఛలో తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత మళ్ళీ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అనుకున్న రేంజ్ విజయాలు దక్కడం లేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు నిరాశ పరుస్తూ రాగా తన హోమ్ బ్యానర్ లో తానె కథ ని అందించి చేసిన లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ ఈ ఇయర్ సంక్రాంతి తర్వాత రిలీజ్ అవ్వగా సినిమా కి…

పర్వాలేదు అనే టాక్ వచ్చినా కానీ సంక్రాంతి సినిమాల జోరు వలన సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 7.2 కోట్ల టార్గెట్ కి 4.8 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసిన సినిమా నష్టాలు గట్టిగానే మిగిలించినా…

టెలివిజన్ శాటిలైట్ రైట్స్ మాత్రం సినిమా కి 3.15 కోట్ల రేంజ్ లో దక్కగా నిర్మాత సేఫ్ అయ్యాడు.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా కానీ టెలివిజన్ లో మాత్రం సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది అని చెప్పాలి. ‘అశ్వథ్థామ’ మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 9.10 TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా…

ఫస్ట్ టైం కుమ్మేసిన తర్వాత సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన సినిమా కి రెండో సారి కొంచం తగ్గినా 5.41 TRP రేటింగ్ తో బాగానే హోల్డ్ చేసింది. ఇక సినిమా IPL స్టార్ట్ అయిన తర్వాత మూడో సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి రెండో సారి కన్నా ఎక్కువ TRP రేటింగ్ రావడం విశేషం అనే చెప్పాలి….

సినిమా కి మూడో టెలికాస్ట్ లో 5.61 TRP రేటింగ్ దక్కి దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేయగా ఛానెల్ కి మొత్తం మీద సాలిడ్ ప్రాఫిట్స్ ని దక్కేలా చేసిన ‘అశ్వథ్థామ’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా బుల్లి తెరపై మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here