మాస్ మహారాజ్ రవితేజ కి టైం అస్సలు బాలేదు అని లేటెస్ట్ మూవీ డిస్కోరాజా మరోసారి రుజువు చేసింది, సినిమా కి డీసెంట్ టాక్ వచ్చినా కానీ ఆడియన్స్ సంక్రాంతి మూవీస్ కే మొగ్గు చూపడం తో డిస్కోరాజా వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ తో ముగించినా వర్కింగ్ డేస్ లో మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా మొదటి వారం లోనే ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 8 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేయగా మొత్తం మీద మొదటి వారం లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టోటల్ గా 6.64 కోట్ల షేర్ ని…
వసూల్ చేసి చాలా స్లో అవ్వగా వరల్డ్ వైడ్ గా కూడా మెప్పించలేక పోయిన సినిమా టోటల్ గా 7 రోజులకు గాను 7.65 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. ఇది సినిమా బిజినెస్ లో సగం కూడా అందుకొక పోవడం విచారకరం అనే చెప్పాలి. మొత్తం మీద ఫస్ట్ వీక్ ఏరియాల వారి…
కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 2.79Cr
?Ceeded: 93L
?UA: 93L
?East: 50L
?West: 37L
?Guntur: 45L
?Krishna: 42L
?Nellore: 25L
AP-TG Total:- 6.64CR
Ka & ROI: 0.44Cr
OS: 0.57Cr
Total WW: 7.65CR(13.33Cr Gross )
ఇదీ సినిమా పరిస్థితి. సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 19.20 కోట్లకు అమ్మారు.
దాంతో 20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 12.35 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. పరిస్థితి చూస్తుంటే సగానికి పైగా నష్టం ఖాయం కాబట్టి సినిమా డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించబోతుంది ఈ సినిమా..