Home గాసిప్స్ లేదనుకున్న సినిమా మళ్ళీ మొదలు…ఊరమాస్ టైటిల్ కన్ఫాం!!

లేదనుకున్న సినిమా మళ్ళీ మొదలు…ఊరమాస్ టైటిల్ కన్ఫాం!!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో హిట్ కొట్టి చాలా కాలమే అయింది, ఒకప్పుడు ఇయర్ కి రెండు మూడు సినిమాలు మినిమమ్ చేస్తూ అందులో కచ్చితంగా ఒకటి రెండు హిట్స్ ఉండేలా చూసుకుంటూ టాలీవుడ్ అక్షయ్ కుమార్ గా పేరు తెచ్చుకున్న రవితేజ తర్వాత ఫాం కోల్పోయాడు, రాజా ది గ్రేట్ తో తన రేంజ్ లో కాకున్నా మంచి కంబ్యాక్ నే ఇచ్చిన రవితేజ…

తర్వాత మాత్రం వరుసగా హాట్రిక్ ఫ్లాఫ్స్ కొట్టగా ఈ ఇయర్ డిస్కో రాజా సినిమా తో మరో డిసాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి టైం లో తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్న రవితేజ ఈ సినిమా కంబ్యాక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత కామెడీ ఎంటర్ టైనర్స్ తీసే త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో సినిమా చేస్తాడు అనుకుంటే, అందరికీ షాక్ ఇస్తూ ఆగిపోయింది అనుకున్న సినిమా ను తిరిగి మొదలు పెట్టబోతున్నాడు రవితేజ. ఇది వరకు రవితేజ కి వీర లాంటి ఫ్లాఫ్ ఇచ్చిన…

రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ కొత్త సినిమా కమిట్ అవ్వగా రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోయింది అన్న టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు తిరిగి ఈ సినిమా ను మిగిలిన సినిమాల కన్నా ముందే లాక్ డౌన్ తర్వాత మొదలు పెట్టబోతున్నాడట రవితేజ. అంతే కాదు ఈ సినిమా కి టైటిల్ ని కూడా కన్ఫాం చేశారని సమాచారం.

త్వరలో మొదలు కాబోతున్న ఈ సినిమా కి “ఖిలాడి” అన్న టైటిల్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారని అంటున్నారు, ఇక రవితేజ ఇందులో డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నారని, పక్కా కమర్షియల్ మాస్ మూవీ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఆగిపోయింది అనుకున్న సినిమా తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here