Home TRP రేటింగ్ రవితేజ మాస్…లాస్ట్ వీక్ టాప్ 2 TRP మూవీస్ తో దుమ్ము లేపాడు!!

రవితేజ మాస్…లాస్ట్ వీక్ టాప్ 2 TRP మూవీస్ తో దుమ్ము లేపాడు!!

0

మాస్ మహారాజ్ రవితేజ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న ఆడియన్స్ లో టెలివిజన్ ఆడియన్స్ లో కూడా తన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదని మరోసారి రుజువు అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ ని ఎదురుకుంటూ తన ఫాం మొత్తం కోల్పోయాడు రవితేజ, ముఖ్యంగా రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ ఇచ్చినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్స్ అయ్యాయి.

నేల టికెట్, టచ్ చేసి చూడు అమర్ అక్బర్ అంటోని మరియు ఈ ఇయర్ డిస్కోరాజా అన్నీ బాక్స్ అఫీస్ దగ్గర డిసాస్టర్ సినిమా లు అవ్వగా ఆడియన్స్ రవితేజ సెన్సేషనల్ కంబ్యాక్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు, ఇక ఇదే సమయం లో రవితేజ కి…

టెలివిజన్ లో మంచి క్రేజ్ ఉందని, ఈ మధ్య నేల టికెట్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయినా టెలివిజన్ లో వచ్చిన ప్రతీ సారి మంచి రేటింగ్స్ ని అందుకోగా ఇప్పుడు లాస్ట్ వీక్ రవితేజ నటించిన 2 సినిమా లు కూడా టాప్ TRP రేటింగ్స్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి.

రవితేజ నటించిన రాజా ది గ్రేట్ మరియు బెంగాల్ టైగర్ సినిమా లు రెండూ కూడా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాల్లో టాప్ 2 ప్లేసులను సొంతం చేసుకున్నాయి.. 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా కి టెలివిజన్ లో లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయినప్పుడు 5.2 TRP రేటింగ్ దక్కింది. దాంతో టాప్ ప్లేస్ లో నిలవగా….

ఇక రెండో ప్లేస్ లో రవితేజ 2015 లో నటించిన బెంగాల్ టైగర్ సినిమా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన టైం లో 4.6 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంది, మొత్తం మీద ఈ రెండు సినిమాల TRP రేటింగ్స్ తో రవితేజ క్రేజ్ చెక్కు చెదరలేదని కన్ఫాం అయింది, ఇక క్రాక్ మూవీ తో రవితేజ కంబ్యాక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here