ఈ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల సంఖ్య చాలా తక్కువే, ఇయర్ మొదలు అయ్యి 5 వ నెల కొనసాగుతుండగా మూడో నెల మొదటి వారం తర్వాత కొత్త సినిమా లు రిలీజ్ అవ్వడం ఆగిపోగా లాక్ డౌన్ వలన ఇప్పటికీ అన్ని థియేటర్స్ మూసే ఉన్నాయి. ఇక ఈ ఇయర్ మొదలైనప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో డబ్బింగ్ మూవీ అతడే శ్రీమన్నారాయణ అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఒకటి.
జనవరి 1 న రిలీజ్ అయిన ఈ సినిమా ఈ ఇయర్ లో మొదటి సినిమా కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్షన్స్ డీసెంట్ గానే వచ్చినా తర్వాత పది రోజుల్లోనే సినిమా పరుగును కంప్లీట్ చేసుకుంది తెలుగు లో.. డానికి కారణం సంక్రాంతి సినిమాల భారీ రిలీజ్.
ఇక ఈ సినిమా తెలుగు లో మొత్తం మీద 2.1 కోట్ల వరకు బిజినెస్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలొకి దిగింది, కాగా 6 రోజుల్లో మొత్తం మీద 1.15 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా మిగిలిన 4 రోజుల రన్ లో మరో…
7 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది, దాంతో తెలుగు లో సినిమా ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సమయానికి టోటల్ గా 1.22 కోట్ల షేర్ ని రాబట్టగలిగింది. కానీ సినిమా బిజినెస్ 2.1 కోట్లు కావడం తో సినిమా మొత్తం మీద 90 లక్షల మేర లాస్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచింది.
కన్నడ లో డీసెంట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా పెర్ఫెక్ట్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ రిలీజ్ కానున్నా కన్నడ ట్రేడ్ లెక్కల ప్రకారం 30 కోట్ల మేర టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ని అందుకుందని చెబుతున్నారు. ఓవరాల్ గా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అయిన ఈ సినిమా తెలుగు లో నిరాశ పరిచినా కానీ మొత్తం మీద పర్వాలేదు అనిపించే రిజల్ట్ ని సొంతం చేసుకుంది.