రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమా పెంగ్విన్… కీర్తి సురేష్ కీలక పాత్ర లో తెరకెక్కిన ఈ సినిమా మిగిలిన నటీనటులు అందరూ కొత్తవాలే అవ్వడం తో బడ్జెట్ మరీ ఎక్కువ ఏమి కాలేదు, కేవలం కీర్తి సురేష్ రెమ్యునరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కెమరామెన్ కి భారీ రెమ్యునరేషన్ దక్కినట్లు సమాచారం… మొత్తం మీద సినిమా ని…
4 కోట్ల లోపు బడ్జెట్ తోనే తెరకెక్కించారని తెలుస్తుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె ఒక్కో భాషలో ఒక్కో రకమైన బిజినెస్ చేసి ఉండేది. కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబట్టి సినిమా కి దక్కిన ఆఫర్ మరీ అద్బుతం ఏమి కాదని తెలుస్తుంది.
సినిమా ను యూనిట్ మొదటి విడత లోనే అడిగిన వెంటనే ఇతర సినిమాలతో కలిపి అమ్మేశారు. అలా కాకుండా కొద్దిగా ఆగి ఉంటె మంచి రేటు దక్కేదేమో కానీ మొత్తం మీద సినిమా కి డిజిటల్ రిలీజ్ కి గాను అన్ని భాషల్లో కలిపి దక్కిన రేటు 7.5 కోట్ల రేంజ్ లో ఉందని తెలుస్తుంది.
ఇది బడ్జెట్ దృశ్యా మంచి లాభామే అయినా కీర్తి సురేష్ మహానటి తర్వాత చేస్తున్న లేడీ ఒరిఎంటేడ్ మూవీ అవ్వడం తో కచ్చితంగా బిజినెస్ మరింత ఎక్కువ గానే జరిగే అవకాశం ఉండేది. కానీ ఓవరాల్ గా ప్రస్తుత పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని సినిమాను 7.5 కోట్లకు అన్ని భాషలు కలిపి డిజిటల్ రిలీజ్ కి అమ్మారు.
ఇక రీసెంట్ గా సినిమా శాటిలైట్ రైట్స్ టాప్ చానెల్ లో ఒకటికి అమ్ముడు పోగా అన్ని భాషలు కలిపి 6 కోట్ల రేంజ్ లో డీల్ జరిగిందని టాక్ ఉంది, ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉండగా ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ 13.5 కోట్లు కాగా పెట్టిన 4 కోట్ల రేంజ్ బడ్జెట్ కి 9 కోట్లకు పైగానే లాభం దక్కినట్లు లెక్క. హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేటు దక్కితే 10 కోట్లకు పైగానే ప్రాఫిట్ తో ఉంటారు నిర్మాత…