బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ఇప్పటి వరకు అందుకోని అఖిల్ అక్కినేని, మార్కెట్ పరంగా అండ్ క్రేజ్ పరంగా కూడా ఇప్పటికీ హిట్ లేకున్నా మంచి డిమాండ్ మీదే ఉన్నాడు. తొలి సినిమా రిలీజ్ కన్నా ముందే మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న అఖిల్ తొలి సినిమా ఓపెనింగ్స్ విషయం లో మాత్రం కుమ్మేసింది. కానీ టాక్ బాలేక పోవడం తో డిసాస్టర్ అయ్యింది. ఆ ఇంపాక్ట్ తర్వాత సినిమా లపై…
గట్టిగానే పడగా మూడు సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని ఇంకా అందుకోలేక పోయాడు అఖిల్. ఇలాంటి టైం లో ఒకప్పుడు సెన్సిబుల్ డైరెక్టర్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చేస్తున్న కొత్త సినిమా…
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పై ట్రేడ్ లో డీసెంట్ బజ్ ఉందని చెప్పాలి. కాగా సినిమా కి లేటెస్ట్ గా శాటిలైట్ రైట్స్ కింద సాలిడ్ రేటు దక్కింది అని ట్రేడ్ వర్గాల్లో వార్తలి గట్టిగా వినిపిస్తున్నాయి. అఖిల్ ప్రీవియస్ మూవీ అయిన మిస్టర్ మజ్నుకి…
5 కోట్ల రేంజ్ లో శాటిలైట్ రైట్స్ దక్కగా ఇప్పుడు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ని స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకుందని అంటున్నారు. కాగా సినిమాకి స్టార్ మా 6.5 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు అంటున్నారు. ఇది నిజంగానే సాలిడ్ రేటు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ లేకున్నా కానీ అఖిల్ సినిమా కి క్రేజ్ బాగానే ఉంది.
దాంతో పాటు ప్రజెంట్ హ్యాపెన్నింగ్ హీరోయిన్ పూజా హెడ్గే అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా హిట్ అవ్వడం లాంటివి కూడా కలిసి వచ్చి సాలిడ్ రేటు సినిమా కి దక్కింది అంటున్నారు. ఇక సినిమాను అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.