వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతుంది కీర్తి సురేష్, మహానటి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకోగా తర్వాత ఆల్ మోస్ట్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ఇలాంటివే అవ్వడం విశేషం, మహానటి తర్వాత కీర్తి సురేష్ ఒప్పుకున్న సినిమాల్లో గుడ్ లక్ సఖి కూడా ఒకటి, 2018 టైం కే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కూడా పూర్తీ అయినా ఎవ్వరికీ పెద్దగా తెలియదు.
సడెన్ గా ఈ సినిమా టీసర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ నే టీసర్ సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయించడానికి మంచి ఆఫర్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఈ సినిమా కి.
కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ పెంగ్విన్ కి అమెజాన్ ప్రైమ్ 7.5 కోట్ల రేటు చెల్లించి హక్కులు సొంతం చేసుకోగా… సాలిడ్ గా వ్యూస్ దక్కాయి ఆ సినిమా కి, దాంతో గుడ్ లక్ సఖి సినిమాకి ఇతర OTT యాప్స్ 10 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధం అవ్వగా…
ఇప్పుడు వాటిని పక్కకు పెట్టి అమెజాన్ ప్రైమ్ ఏకంగా 13 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధం అయిందట. పెంగ్విన్ సినిమాతో పోల్చుకుంటే ఇది ఆల్ మోస్ట్ డబుల్ రేటు అనే చెప్పాలి. సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువే అవ్వడం తో ఈ డీల్ తో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారని సమాచారం. మరి కొన్ని రోజుల్లో ఇంకా బెటర్ డీల్…
వస్తుందేమో అని ఎదురు చూసి, లేకపోతె అమజాన్ ప్రైమ్ ఆఫర్ కి ఓకే చెప్పాలని చూస్తున్నారట. వాళ్ళు ఓకే అంటే కీర్తి సురేష్ కి కంటిన్యుగా రెండో సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా పై అఫీషియల్ అప్ డేట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు…