మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ సినిమాల స్పెషలిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి సినిమాలంటే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఎప్పటికీ ఉంటుంది, ఒక్క వినయ విధేయ రామ సినిమా తో వెండి తెరపై పూర్తిగా విఫలం అయ్యాడు తప్పితే ప్రతీ సారి మినిమమ్ గ్యారెంటీ సినిమాలు ఇవ్వడం లో బోయపాటి రేంజ్ మరో లెవల్ అనే చెప్పాలి. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు…
బుల్లి తెరను ఏలుతున్న విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ వినయ విధేయ రామ టెలివిజన్ ఊరమాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సెన్సేషనల్ రికార్డ్ ను సృష్టించగా…. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలు ఇండియా లెవల్ లో రచ్చ రచ్చ చేశాయి.
అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయక సినిమాలు రెండూ కూడా ఇండియా లో మరే సినిమాలు సాధించని విధంగా 300 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందు కుని హిస్టారికల్ రికార్డ్ తో సెన్సేషనల్ బెంచ్ మార్క్ ని అందుకున్నాయి…
సరైనోడు సినిమా అనేక సార్లు అప్లోడ్ అయ్యి డిలేట్ కూడా అయినా మళ్ళీ లేటెస్ట్ వర్షన్ 300 మిలియన్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా చరిత్ర సృష్టించగా… ఇప్పుడు లేటెస్ట్ గా జయ జానకి నాయక సినిమా కూడా ఈ మార్క్ ని అందుకుని ఈ రికార్డ్ అందుకున్న రెండో ఇండియన్ మూవీ గా నిలిచి దుమ్ము దుమారం లేపింది.
ఇలాంటి రికార్డులు సొంతం చేసుకున్న సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత బోయపాటి కి సొంతం అయ్యింది అని చెప్పాలి. దాంతో ఇప్పుడు ఇండియా లో ఇలాంటి రికార్డ్ సొంతం చేసుకున్న ఓకె ఒక్క డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నాడు బోయపాటి… తను కావాలి అని చేయకపోయినా తన మాస్ మూవీస్ కి ఆదరణ ఈ రేంజ్ లో ఉండటం అయితే విశేషం అనే చెప్పాలి…