Home గాసిప్స్ బోయపాటి తో సూర్య సినిమా…రికార్డ్ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారట!

బోయపాటి తో సూర్య సినిమా…రికార్డ్ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారట!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోల్లో ముందు నిలిచే హీరో సూర్య, ఆల్ మోస్ట్ తెలుగు హీరోలతో ఈక్వల్ గా ట్రీట్ చేసే సూర్య కి కూడా టాలీవుడ్ ఆడియన్స్ అంటే చాలా ఇష్టం, చాలా కాలంగా తెలుగు లో డైరెక్ట్ సినిమా చేయాలని సూర్య కూడా అనుకుంటున్నాడు కానీ ఎందుకనో స్క్రిప్ట్ అనుకున్న విధంగా ఉండక పోవడం వలన ఎప్పటికప్పుడు సూర్య తెలుగు సినిమా…

డిలే అవుతూ వస్తుండగా…ఈ మధ్య మాత్రం వరుస పెట్టి కోలివుడ్ హీరోలు తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు కమిట్ అయ్యి బైలింగువల్ మూవీస్ ని ఓకే చేస్తుండటం తో ఎప్పటి నుండో ఇక్కడ క్రేజ్ ని సొంతం చేసుకున్నా డైరెక్ట్ సినిమా విషయం లో స్లో అయిన సూర్య…

ఇప్పుడు తెలుగు మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బోయపాటి తో సూర్య సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ప్రొడ్యూసర్ సూర్య కి రికార్డ్ లెవల్ లో రెమ్యునరేషన్ ని కూడా ఆఫర్ చేశారని…

టాక్ గట్టిగా వినిపిస్తుంది. సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే విధంగా 60 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్ ను సూర్య కి ఇవ్వడానికి సిద్ధం అన్నట్లు చెప్పారట. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో బిజీ గా ఉండగా ఆ సినిమా తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు… . ఈ లోపు బోయపాటి కూడా బాలయ్యతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు….

ఆ సినిమా తర్వాత సూర్యతో సినిమా ఉంటుందని అంటున్నారు…. తెలుగు లో సూర్య కి బోయపాటి స్టైల్ లో కమర్షియల్ మూవీ పడితే ఇక్కడ మార్కెట్ మరింత పెరగొచ్చు. ఆల్ రెడీ విక్రమ్ లో రోలెక్స్ రోల్ తో తిరిగి సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సూర్య ఈ సినిమా సెట్ అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఉంది….. మరి ఎం జరుగుతుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here