మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్… బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసు లో నిలవాల్సిన ఈ సినిమా కరోనా వలన మిగిలిన సినిమాల మాదిరిగానే పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ పై కన్నేసింది… అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైం లో ఈ సినిమా విషయం లో కూడా ట్విస్ట్ లు జరుగుతున్నాయి అన్నది లేటెస్ట్ న్యూస్..
మిగిలిన సినిమాలకి ఈ మధ్య రేట్లు తగ్గుతున్నా కానీ ఈ సినిమా కి మాత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ రేటు స్టడీ గా కొన్ని సార్లు పెరుగుతూ వెళ్లి ఫైనల్ గా 25 కోట్ల రేంజ్ రేటు కి ఫిక్స్ అయ్యింది అన్న టాక్, ఇక త్వరలోనే అఫీషియల్ కన్ఫామేషన్ కూడా రాబోతుంది అంటూ…
వార్తలు ప్రచారం లో ఉండగా జీ 5 వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన పే పెర్ వ్యూ స్కీమ్ లో జీ ప్లెక్స్ లో సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండగా ఈ సినిమా ని కూడా అలానే రిలీజ్ చేయాలి అని భావించారు…. దాంతో టీం కొద్దిగా షాక్ అయినా….
ఈ పద్దతిలో రిలీజ్ అయిన సినిమాల పెర్ఫార్మెన్స్ ని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించారు.. ఈ పద్దతిలో 2 సినిమాలు రిలీజ్ అవ్వగా మొదటి రోజు నాసిరకం వ్యూస్ మాత్రమె వచ్చాయి, కానీ ఈ పద్దతి వల్ల OTT వాళ్లకి ముప్పు ఉండదు కాబట్టి ఈ రూట్ నే ఫాలో అవ్వాలని టీం ని కోరుతున్నారట.
ఇక ఈ సినిమా కి కూడా టికెట్ రేటు ఫిక్స్ చేశారని అంటున్నారు, ఒక్కో టికెట్ 199 రేటు తో సినిమాను రిలీజ్ చేసే ప్రతిపాదనని టీం ముందు పెట్టారట. కానీ టీం మాత్రం సినిమాను ఇలా రిలీజ్ చేసే విషయం లో పునరాలోచనలో ఉన్నారని తెలుస్తుంది, మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం కొన్ని రోజుల్లో క్లియర్ గా తెలుస్తుందని అంటున్నారు.