మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి మరియు ప్రతిరోజూ పండగే సినిమాల ఘన విజయాల తర్వాత చేసిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్, బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా తర్వాత డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లు బాగానే వచ్చినా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అనే సరికి ఆ రూట్ వద్దు అనుకుని ఇక థియేటర్స్ లోనే…
రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా మళ్ళీ ఏమైందో ఏమో సినిమా అన్ని హక్కులను కూడా జీ నెట్ వర్క్ కి ఏకంగా 38 కోట్ల రేంజ్ రేటు కి అమ్మేయడం జరిగింది. ఇందులో థియేట్రికల్ బిజినెస్ హక్కులు కూడా ఉండగా ఇప్పుడు ఏరియాల వారిగా సినిమాను ఎంతకు అమ్మాలి అన్నది…
జీ నెట్ వర్క్ ఇష్టం అని చెప్పోచ్చు. డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించిన మరో న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది…. ఆ న్యూస్ ప్రకారం సినిమా అన్ని హక్కులను కొనడానికి ఒక కండీషన్ ని పెట్టి జీ నెట్ వర్క్ ఈ సినిమాను కొందని అంటున్నారు.
ఆ కండీషన్ ఏంటంటే… సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 3 నుండి 5 వారాల లోపు డిజిటల్ రిలీజ్ కూడా అవుతుందట. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు మూడు వారాల కలెక్షన్స్ పరిస్థితి చూసి తర్వాత తమ యాప్ లో సినిమాను రిలీజ్ చేస్తారు అని సమాచారం. ఆ కండీషన్ మీదే సినిమాను కొన్నారని అదే ఇద్దరికీ ప్రాఫిటబుల్ పని అని డిసైడ్ అయ్యారట.
రెండు వారాలు 50% ఆక్యుపెన్సీ తో ఎంత రికవరీ చేస్తే అంతా, అలాగే సినిమా డిజిటల్ రిలీజ్ వలన యాప్ కి ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ టైం లో మరింత క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పాలి. త్వరలోనే రిలీజ్ డేట్ ని తెలియజేస్తారని అంటున్నారు.