బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని 2014 లో మొదలు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్, మొదటి విజయాన్ని 5 ఏళ్ల తర్వాత రాక్షసుడు సినిమా తో సొంతం చేసుకోగా, ఆ సినిమా వచ్చి ఇప్పటికి ఆల్ మోస్ట్ ఏడాదిన్నర కంప్లీట్ అవ్వగా తన కొత్త సినిమాలు ఒకటి తర్వాత ఒకటి మొదలు పెడుతున్న బెల్లంకొండ ముందుగా అల్లుడు అదుర్స్ తో తెలుగు ఆడియన్స్ ముందు తర్వాత ఛత్రపతి రీమేక్ తో హిందీ లో అడుగు పెట్టనున్నాడు.
ఇక అల్లుడు అదుర్స్ సినిమా ను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా అప్పుడు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు, తర్వాత కంప్లీట్ గా సైలెంట్ అవ్వగా తర్వాత మరో కొత్త పోస్టర్ ని షూటింగ్ ని తిరిగి…
మొదలు పెడుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు… తర్వాత మళ్ళీ సైలెంట్ అవ్వగా బెల్లంకొండ కొత్త సినిమాలను కమిట్ అయ్యే పనిలో బిజీ అయ్యాడు.. ఇప్పుడు టాలీవుడ్ మళ్ళీ కొత్త సినిమాలతో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాను…
సడెన్ గా ఇప్పుడు సంక్రాంతి రేసు లో నిలపబోతున్నారని అనౌన్స్ చేశారు… ఇప్పటికే టాలీవుడ్ నుండి క్రాక్, రెడ్ మూవీస్ తో పాటు కుదిరితే అరణ్య మరియు బంగారు బుల్లోడు రిలీజ్ కాబోతుండగా మరో పక్క విజయ్ మాస్టర్ కూడా రిలీజ్ కానుంది. వీటిలో అరణ్య కొంచం డౌట్ గా మారగా మిగిలిన సినిమాలకు థియేటర్స్ సరిపోతాయి అనుకుంటే సడెన్ గా ఇప్పుడు రేసులోకి….
బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ ఎంటర్ అయ్యాడు… ఒక టీసర్ లేదు, కొత్త పోస్టర్ లేదు ట్రైలర్ లేదు సాంగ్స్ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు, ఇంకా 12 రోజుల టైం మాత్రమే ఉన్న టైం లో సడెన్ గా రేసులోకి ఎంటర్ అయిన అల్లుడు అదుర్స్ తో థియేటర్స్ సమస్య వచ్చే ఛాన్స్ ఉన్నా ఆడియన్స్ థియేటర్స్ కి తిరిగి వచ్చే అవకాశం మాత్రం చాలా ఉందని చెప్పాలి.