టాలెంటెడ్ హీరో శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపి చాలా కాలమే అవుతుంది, 2017 లో బాక్ టు బాక్ రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు శర్వానంద్, శతమానం భవతి మరియు మహానుభావుడు సినిమాల విజయాలతో తన రేంజ్ మరింత పెరగగా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయాయి. ఇలాంటి టైం లో ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు.
ఇలాంటి టైం లో భయపడకుండా మళ్ళీ మరో ప్రయోగం చేయాలనీ డిసైడ్ అయిన శర్వానంద్ ఇప్పుడు శ్రీకారం అంటూ మరో ఎక్స్ పెరిమెంటల్ మూవీతో ఆడియన్స్ ముందుకు మహా శివరాత్రి కానుకగా రాబోతున్నాడు. ఇక సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్…
మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. కాగా టీసర్ చూస్తుంటే మాత్రం ఇది శర్వానంద్ కి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉందనిపిస్తుంది…సినిమా కాన్సెప్ట్ ని చిన్న గ్లిమ్స్ గా చూపెట్టారు. హీరో కొడుకు హీరో అవుతున్నాడు, బిజినెస్ మాన్ కొడుకు బిజినెస్ మాన్ అవుతున్నాడు. పొలిటీషియన్ కొడుకు…
పొలిటికల్ లీడర్ అవుతున్నాడు కానీ ఒక వ్యవసాయ రైతు మాత్రం తన కొడుకు రైతు అవ్వాలని కోరుకోవడం లేదు, అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్ బాగుండగా హీరో మాత్రం రైతుగా మారాడు అన్నది టీసర్ లో చూపెట్టారు. మొత్తం మీద టీసర్ విజువల్స్ రీఫ్రెశింగ్ గా అనిపించాయి అని చెప్పాలి. శర్వానంద్ కంబ్యాక్ గట్టిగానే ఇచ్చేలా ఉన్నాడు ఈ సారి అనిపించే విధంగా టీసర్ మెప్పించగా…
టీసర్ కి మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించింది. మహా శివరాత్రి కానుకగా మార్చి 11 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి ట్రేడ్ లో మంచి బజే ఉందని చెప్పాలి. ఇప్పుడు టీసర్ రిలీజ్ తో మరింత బజ్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక టీసర్ మొదటి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుందో చూడాలి.