యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ నే సొంతం చేసుకుంది, విశాల్ ఇది వరకు నటించిన అభిమన్యుడు తరహా కథనే పోలి ఉన్న ఈ సినిమా మరీ అభిమన్యుడు రేంజ్ లో లేకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్ర నిరాశనే…
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది. సినిమా మొత్తం మీద 35 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందగా సినిమా తెలుగు బిజినెస్ 4.9 కోట్లకు జరిగింది. తమిళ్ బిజినెస్ క్లారిటీ లేదు కానీ కలెక్షన్స్ మొత్తం మీద 6 రోజులకు గాను ఎంత సాధించింది అన్నది రిలీజ్ అయ్యాయి.
ఆ లెక్కలను గమనిస్తే…6 రోజుల్లో సినిమా తమిళనాడులో 6.2 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుందట, ఇక తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 60 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకుందట. ఇక ఓవర్సీస్ లో సినిమా 50 లక్షల వరకు గ్రాస్ ని…
మొత్తం మీద సొంతం చేసుకుందని అంటున్నారు. అంటే సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో 13.3 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది, షేర్ ఒక 7 కోట్ల లోపే ఉంటుంది అన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే తమిళ్ తో పోల్చితే తెలుగులో సమానంగా కలెక్షన్స్ వచ్చాయి, అది కూడా భారీ పోటి లో… మొత్తం మీద బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చిల్లర కలెక్షన్స్ అనే చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత తక్కువ కలెక్షన్స్ రావడానికి రీజన్స్ ఏంటి అనేది తెలియరాలేదు, తెలుగు లో నార్మల్ గానే విశాల్ మూవీస్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అలానే రెస్పాన్స్ ఉన్నప్పటికీ తమిళ్ లో ఇంత తక్కువ కలెక్షన్స్ చూసి ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ అయింది… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద డిసాస్టర్ గా మిగిలిపోయే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు.