Home టోటల్ కలెక్షన్స్ 25 కోట్లతో సినిమా తీస్తే 30 లక్షల షేర్…ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ...

25 కోట్లతో సినిమా తీస్తే 30 లక్షల షేర్…ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమానే!!

0

ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేక కొన్ని సినిమాలు అత్యంత దారుణమైన నష్టాలతో భారీ ఫ్లాఫ్ మూవీస్ గా నిలుస్తూ వచ్చాయి కానీ ఇలా కాకుండా హిస్టరీలో మొదటి సారిగా OTT లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా ఊహ కందని నష్టాలను సొంతం చేసుకుని బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లిస్టు లో నిలిచింది, ఆ సినిమానే లాస్ట్ ఇయర్ ఎండ్ టైం లో అనన్య పాండే మరియు ఇషాన్ కట్టర్ ల కాంబినేషన్ లో రూపొందిన ఖాళీ పీలి సినిమా…

సినిమా టీసర్ ట్రైలర్ లు ఆకట్టుకున్నా కానీ నెపో కిడ్స్ పై సుశాంత్ ఫ్యాన్స్ తో పాటు అందరి కీ ఉన్న కోపం ఈ సినిమా విషయం లో పీక్స్ కి వెళ్ళింది.. సినిమాను ఎదో రేటు కి అమ్మి డైరెక్ట్ రిలీజ్ చేయకుండా పే పెర్ వ్యూ పద్దతిలో జీ ప్లేక్స్ లో రిలీజ్ చేశారు.

సినిమా కి ఏకంగా 25 కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలు సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో టికెట్ 299 తో రిలీజ్ చేయగా సినిమాను కొని చూడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు…సినిమా కి టోటల్ గా పే పెర్ వ్యూ పద్దతిలో సేల్ అయిన టికెట్లు మొత్తం మీద…

20.5 వేల దాకా ఉండగా 299 టికెట్ రేటు తో…61 లక్షల 29 వేల దాకా వెళ్ళగా అందులో జీ ప్లేక్స్ వాళ్లకి 20 లక్షల దాకా వెళ్ళగా నిర్మాతలకు 41 లక్షల దాకా వచ్చిందని, డిజిటల్ యాడ్స్ కి 10 లక్షల వరకు ఖర్చు చేసిన జీ ప్లేక్స్ వాళ్ళు అవి కూడా తీసుకోగా మొత్తం మీద నిర్మాతలకు వెళ్ళింది మాత్రం…

30 లక్షల రేంజ్ లో ఉంటుంది అని అంటున్నారు. అంటే సినిమాను 25 కోట్లతో నిర్మిస్తే 30 లక్షలు వచ్చింది అన్న మాట… ఇక ఈ సినిమా ను ఎంతో కొంత రేటుకి జీ 5 వాళ్ళకే అమ్మేశారని అంటున్నారు…మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె రిజల్ట్ ఎలా ఉండేదో కానీ పే పెర్ వ్యూ పద్దతిలో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది ఈ సినిమా.. దాంతో డిజిటల్ రిలీజ్ లో ఇలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఫస్ట్ సినిమాగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here