బాలీవుడ్ లో ఈ మధ్య కొన్ని సినిమాలకు విపరీతమైన వ్యతిరేకత ఆడియన్స్ నుండి ఎక్కువగా వస్తుంది, సినిమా ఏమాత్రం బాలేక పోయినా సరే ఆ సినిమా కి రేటింగ్ లు ఓ రేంజ్ లో తగ్గిస్తున్నారు… ప్రతీ సినిమా కి యూసర్ రేటింగ్ ని బట్టి సినిమా రేంజ్ ఏంటో చెప్పే IMDB లో ఈ మధ్య ఒకటి తర్వాత ఒకటి బాలీవుడ్ సినిమాలకు చుక్క ఎదురు అవుతుంది అని చెప్పాలి…
రీసెంట్ టైం లో బాలీవుడ్ సినిమాలలో అత్యల్ప యూసర్ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 5 సినిమాలను గమనిస్తే…. ముందుగా టాప్ 5 ప్లేస్ లో లాస్ట్ ఇయర్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఖాళీ పీలి సినిమా కి కేవలం 2.3 యూసర్ రేటింగ్ మాత్రమే వచ్చింది.
ఇక నాలుగో ప్లేస్ లో లాస్ట్ ఇయర్ పాండమిక్ కన్నా ముందు రిలీజ్ అయిన భాగీ 3 సినిమా కి 2.1 యూసర్ రేటింగ్ మాత్రమే దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు తడాఖా రీమేక్ గా తెరకెక్కింది. ఇక మూడో ప్లేస్ లో రెండేళ్ళ క్రితం సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 సినిమా నిలిచింది అని చెప్పాలి.
ఈ సినిమాకి మొత్తం మీద 1.9 యూసర్ రేటింగ్ మాత్రమే దక్కి అప్పట్లో టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక రెండో ప్లేస్ లో రీసెంట్ గా మళ్ళీ సల్మాన్ ఖానే నటించిన వాంటెడ్ సీక్వెల్ రాధే సినిమా కి కేవలం 1.7 యూసర్ రేటింగ్ మాత్రమే లభించింది. దాంతో తన పేరిట ఉన్న రికార్డ్ ను తానె బ్రేక్ చేశాడు సల్మాన్ ఖాన్.
ఇక మొదటి ప్లేస్ లో మళ్ళీ లాస్ట్ ఇయరే వచ్చిన సడక్ 2 సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే అత్యల్ప రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా కి కేవలం 1.1 యూసర్ రేటింగ్ మాత్రమే లభించింది. బాలీవుడ్ హిస్టరీలోనే కాదు వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ది లోవేస్ట్ రేటింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.