ఇది నిజంగానే ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఒక చారిత్రిక రికార్డ్ గా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు ఎక్కువ గా 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని మినిమం అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాయి. అవి కూడా వరుసగా 16 సార్లు మినిమం 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు రికార్డ్ కాదు. కానీ ఈ రికార్డ్ ను సాధించి సల్మాన్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.
కెరీర్ లో రెండు మూడేళ్ళ క్రితం వరకు పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఒక దశాబ్దం పాటు మిగిలిన హీరోలు ఎవ్వరూ పోటి కూడా ఇవ్వని విధంగా ఎంజాయ్ చేసిన సల్మాన్ ఇప్పుడు వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకుంటున్నా కానీ కొత్త సినిమాలతో మినిమమ్ 100 కోట్లు అయినా కలెక్ట్ చేస్తూ…
తన స్టామినా ఫ్లాఫ్ మూవీస్ తో కూడా కొనసాగుతుంది అంటూ నిరూపిస్తూ వెళుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి… దబాంగ్ సినిమా తో మొదలైన ఈ రికార్డుల పరంపర… రెడీ, బాడీ గార్డ్, కిక్, జైహో, ఏక్ థా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో…..
దబంగ్-2, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్-3, భారత్ దబాంగ్ 3 మరియు లేటెస్ట్ గా OTT లో రిలీజ్ అయ్యి వారంలో 200 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన రాదే వరకు కంటిన్యు గా కొనసాగింది, బాలీవుడ్ చరిత్ర లోనే కాదు… ఇండియన్ సినిమా హిస్టరీ లో కూడా ఇలాంటి ఊహకందని రికార్డ్ ను నమోదు చేసిన హీరో మరొకరు లేరు….
అది కూడా వరుసగా అందుకున్న హీరో లేరనే చెప్పాలి. ఈ లిస్టులో జై హో, ట్యూబ్ లైట్, మరియు రేస్ 3 సినిమాలు ఫ్లాఫ్ టాక్ తోనూ సంచలనం సృష్టించాయి. ఇక రాధే OTT లో ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసి సంచలనం సృష్టించింది… మొత్తం మీద 16 సార్లు 100 కోట్ల రికార్డ్ ఇప్పట్లో ఆగే అవకాశం కూడా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.