ప్రతీ వీకెండ్ చాలా సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. వీకెండ్ అయితే అన్ని ఛానెల్స్ లో కొత్త పాత అన్న తేడా లేకుండా నాన్ స్టాప్ మూవీస్ వేస్తూ ఉంటారు. కానీ అన్ని సినిమాలకు ఆశించిన రేటింగ్ లు రావు, సినిమాల క్రేజ్ ని బట్టి ఆ సినిమాను ఎంత మంది చూస్తున్నారు అన్న వాటి పై రేటింగ్స్ ఆధార పడి ఉంటాయి. లాస్ట్ వీక్ కూడా తెలుగు లో…
అన్ని ఛానెల్స్ లో చాలా సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి, వాటిలో టాప్ రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… ఉప్పెన సినిమా రెండో టెలికాస్ట్ లో 11.37 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచింది. ఇక తర్వాత రాక్షుసుడు సినిమా 4.22 రేటింగ్ ను అందుకోగా…
తర్వాత విజయ్ మాస్టర్ రెండో టెలికాస్ట్ లో 3.81 రేటింగ్ ను సొంతం చేసుకుంది. తర్వాత గద్దలకొండ గణేష్ 3.04 రేటింగ్ ను సొంతం చేసుకోగా, భరత్ అనే నేను 2.97 రేటింగ్ ను సాధించింది. ఓల్డ్ మూవీ నువ్వొస్తానంటే నేనోద్దంటానా సినిమా 2.56 రేటింగ్ ను సొంతం చేసుకోగా… అమ్మోరు తల్లి కూడా 2.56 రేటింగ్ ను అందుకుంది.
ఇక జులాయి సినిమా 2.43 రేటింగ్ ను అందుకోగా పైసా వసూల్ 2.02 రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఇక తొలిప్రేమ సినిమా 2.01 రేటింగ్ ను సాధించింది, ఠాగూర్ సినిమా 1.78 రేటింగ్ ను సొంతం చేసుకోగా చివరి ప్లేస్ లో ప్రతీ రోజూ పండగే సినిమా 1.56 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ మూవీస్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచాయి.
ఇక అంతకుముందు వారం టెలికాస్ట్ అయిన రామ్ రెడ్ మూవీ రెండో సారి టెలికాస్ట్ టైం లో 3.22 రేటింగ్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద లాస్ట్ వీక్ చాలా సినిమాలు లిస్టులో ఉండటం విశేషం. ఇక ఈ వీక్ లో టెలికాస్ట్ అయ్యే సినిమాలు వచ్చే వారం ఎన్ని లిస్టులో చోటు సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక.