Home గాసిప్స్ 32 కూడా కాదు…2 ఫ్లాఫ్స్ పడ్డా రేటు ఇంకా పెరగడం ఏంటి సామి!!

32 కూడా కాదు…2 ఫ్లాఫ్స్ పడ్డా రేటు ఇంకా పెరగడం ఏంటి సామి!!

0

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న విషయం తెలిసిందే, కెరీర్ లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో లాస్ట్ ఇయర్ భీష్మ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన నితిన్, తర్వాత చేసిన సినిమాలతో నిరాశ పరిచాడు. ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన చెక్ మరియు రంగ్ దే సినిమాలతో…

ఆడియన్స్ ను నిరాశ పరిచిన నితిన్ బాక్ టు బాక్ రెండు సినిమాలతో ఫ్లాఫ్స్ ను మూటగట్టుకున్నాడు. అయినా కానీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేస్ట్రో పై ఏమాత్రం కనిపించడం లేదని చెప్పాలి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన…

అంధ ధూన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ ఎక్స్ పెరి మెంటల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. దాంతో సినిమా తో నితిన్ కంబ్యాక్ కన్ఫాం అనుకున్నా ఇంతలో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమా రిలీజ్ కి అడ్డంకులు మొదలు అవ్వగా…

సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. రీసెంట్ గా సినిమా రైట్స్ 32 కోట్లకు అమ్ముడు పోయినట్లు టాక్ రాగా అసలు రేటు ఇంకా పెరిగి 35 కోట్లకు డీల్ ని క్లోజ్ చేశారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఈ రేటుకి…

సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఇది నిజంగానే అల్టిమేట్ రేటు అని చెప్పొచ్చు. థియేట్రికల్ బిజినెస్ కూడా ఈ రేంజ్ సొంతం అవ్వడం కష్టమే.. అందునా ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడం తో ఈ సాలిడ్ డీల్ ని ఓకే చేశారని అంటున్నారు. ఆగస్టు లో సినిమా డిజిటల్ రిలీజ్ కానుంది అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here